Homeఎంటర్టైన్మెంట్ప్చ్.. డైరెక్షన్ చేసినా క్రెడిట్ అంతా అతనికే !

ప్చ్.. డైరెక్షన్ చేసినా క్రెడిట్ అంతా అతనికే !

Directorసినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా నిలబడటం మాటలు కాదు. కొంతమంది దర్శక నిర్మాతల దగ్గర దర్శకుడిగా పని చేయడం నరకంలా ఉంటుంది. ఏడాది పాటు కూర్చుని దర్శకుడు కథ రాసుకుంటాడు. నిర్మాత గంట సేపు కథ విని ఏదో మిస్ అయింది అంటాడు. పోనీ, కథ బాగాలేదు అంటాడా ? అనడు. సినిమా నేను చేయను అంటాడా ? అనడు. సినిమా చేస్తున్నాం అంటూనే సంవత్సరాల పాటు దర్శకుడ్ని అఫీస్ లోనే కుర్చోపెడతాడు.

జీవితం పణంగా పెట్టి, కాలాన్ని వృధా చేస్తూ కూర్చున్న ఆ దర్శకుడికే తెలుసు, అది ఎంత నరకంగా ఉంటుందో. దీనికితోడు ఎంతో కష్టపడి రాసుకున్న కథలో కాళ్లు, చేతులు పెట్టి మరీ కెలికేసే నిర్మాతను ఏమి అనలేక, అలా అని వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక సతమతమవుతూ ఉంటారు సదరు దర్శకులు. వీటిన్నిటినీ దాటుకుని వచ్చి, హిట్ సినిమా తీసిన వాడే ఇక్కడ దర్శకుడిగా నిలబడతాడు.

లేనోడు కాల ప్రవాహంలో కొట్టుకు పోవాల్సిందే. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన ఓ సినిమా విషయంలో ఆ దర్శకుడికి ఇలాగే జరిగిందట. డైరక్టర్ కొత్త వాడు కావడంతో, కథ రాసిన అతనికి డైరక్షన్ మీద విపరీతమైన ఆసక్తి ఉండటంతో భయంకరంగా బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేసేసాడట. ప్రతి షాట్ విషయంలో తనకు నచ్చినట్టు తీయడం, పైగా సీన్ మేకింగ్ విషయంలో, అలాగే చివరకు మ్యూజిక్ విషయంలో కూడా డైరెక్టర్ కి ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వలేదట.

పాపం, డైరెక్టర్ గా సినిమా ఛాన్స్ వచ్చింది, ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని ఎన్నో కలలు కన్న, ఆ డైరెక్టర్ కు చివరకు కనీస పేరు కూడా రాలేదు. సినిమాకి నెగిటివ్ రివ్యూస్ వచ్చినా.. జనంలో మాత్రం సినిమా పై బాగానే ఆసక్తి క్రియేట్ అయింది. కానీ, ఆ క్రెడిట్ మొత్తం ఆ సినిమాకి కథ మాటలు అందించిన వ్యక్తికే వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి కూడా డైరెక్టర్ కావడమే, ఇక్కడ ప్రధాన సమస్య అయింది. మరి ఆ కొత్త డైరెక్టర్ కి మళ్లీ సినిమా వస్తోందా ? చూడాలి.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version