Alitho Saradaga: తనదైన స్టైల్లో పంచ్ లు కురిపిస్తూ, తన అవసరం ఉంటే స్కిట్ లల్లో కూడ కనిపించి నవ్వులు పూయించడమే పని గా పెట్టుకున్నారు సింగర్ మరియు జడ్జ్ మనో. అలాంటి మనో ని అలి తో జతకడితే అద్యంతం నవ్వులే. చూసే ప్రేక్షకుడికి కూడ అప్పుడే షో అయ్యిందా అని అనిపించేలా చేశాడు మనో.
ప్రతి సోమవారం రాత్రి 9.30 కు వినోదాన్ని పంచడానికి వచ్చే అలీతో సరదాగా లో ఈ వారం మనో (నాగుర్ బాబు) మరియు ఆయన సతీమణి జమీల వచ్చారు అందరిని అలరించిడానికి.
షో ఎంట్రీ మనో పాడిన రజినీకాంత్ ముత్తు సినిమా లోని తిల్లన తిల్లనా సాంగ్ తో చిందులు వేసి అందరిని అలరించి నవ్వులు పూయించరు అలి.
మనో అంటేనే ముందుగా జనాలకి గుర్తువచ్చేది జబర్దస్త్. అలాంటి జబర్దస్త్ షో కి జడ్జ్ గా వ్యవహరించిన నాగబాబు కొన్ని అనివార్య కారణాల వల్ల షో నుండి తప్పుకున్న సంగతి తెల్సిందే. దాని తర్వాత జాని మాస్టర్, శేఖర్ మాస్టర్ గెస్ట్ జడ్జ్ గా వచ్చి తమదైన పంచులతో షో ని అలరించారు. మళ్ళీ నాగబాబు స్థానంలో చాలా రోజుల నుండి జబర్దస్త్ మరియు Extra జబర్దస్త్ షోలకి జడ్జ్ గా వ్యవహరిస్తూ తనదైన పంచ్ లతో అలరిస్తూ అవసరం అయితే స్కిట్స్ లో కూడా మెరుస్తూ అందరి దష్టిని ఆకర్షించారు మనో. అలాంటి వినోదాన్ని అలి తో సరదాగా లో పంచడానికి ఆయన సతీమణి తో పాటు అలి షో కి విచ్చేశారు.
ఆద్యంతం షో మొత్తం నవ్వులు పువ్వులు పూయించారు అలి మరియు మనో. నవ్వులే కాకుండా తన లో ప్రేమ కోణం కూడా దాగి ఉందని బయట పెట్టారు మనో. మనో సతీమణి జమిలాది తెనాలి. చూడగానే నేను నీకు నచ్చానా అని మనో అడగగా నేను మీకు నచ్చాన అని తిరిగి అడగగా ఒక్కసారి ఆశ్చర్యపోయాడట మనో. అలా ఒకరినికొరిని ఇష్టపడి చాలా చిన్న వయసులో పెళ్ళి చేసుకున్నారు మనో మరియు జమిలా.మనో మీద ఉన్న ప్రేమతో జమీలా మనో రూపాన్ని పచ్చబొట్టుగా తన కుడి చేతి మీద వేయించుకుంది.
అంతే కాకుండా తన భర్త కి సరైన గుర్తంపు రాలేదు అని వాపోయింది. ఎన్నో వేల పాటలతో కళామతల్లిని అలరిస్తున్న మనో కి ఇంతవరకు తగిన గుర్తింపు రాలేదు అని జమిలా అలి తో సరదాగా షో లో తన బాధని పంచుకున్నారు. అంతే కాకుండా ప్రభుత్వం తన భర్త కి పద్మ శ్రీ ఇచ్చి గుర్తించాలి అని వాపోయారు.
అంతే కాకుండా మనో లో చిలిపి కృష్ణుడు దాగి ఉన్నాడని జమిలా తన అన్న అయిన అలి తో పంచుకున్నారు. జమిలా కి కోపం వచ్చినప్పుడు రెండు పాటలు (అపురూపమయినది అమ్మ ఆడ జన్మ, మనసున మనసై బ్రతుకున బ్రతుకై) అనే రెండు పాటలు పాడి తనని చల్లబరుస్తాడట.
ఇలా ఒకటేమిటి మనో మరియు జమిలా జీవితం లో జరిగిన మధుర స్మృతులను నెమరువేసుకుంటూ చూస్తున్న ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఇదంతా చూసేసరికి ప్రేక్షకులకు షో అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం షో నిడివి ఉంటే బాగుండు లేదా పార్ట్ -2 ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు.