Missamma Movie: స్టార్ హీరోలు ఉన్నా హాస్యనటుడి పై రెండు పాటలు తీశారు!

Missamma Movie: అప్పట్లో అంటే.. తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎన్నో మహాచిత్రాలు అద్భుతమైన క్లాసిక్ చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల్లో మేటి చిత్రంగా ఇప్పటికీ మిగిలిపోయింది ‘మిస్సమ్మ’. ఈ చిత్రం దర్శకత్వ పరంగా కూడా గొప్ప చిత్రం అనిపించుకుంది. ఈ సినిమాలో ఉన్న మరో గొప్ప విషయం సున్నితత్త్వం. కథలో వేరు మతాల ఉనికి, వ్యాఖ్యానం ఉన్నా, నొప్పించక తానొవ్వక అంటూ ఎంతో సున్నితంగా సాగుతుంది సినిమా. అన్నిటికి మించి సినిమా నటులెవ్వరూ నటిస్తున్నట్టు కాక, ఏదో […]

Written By: admin, Updated On : September 15, 2021 3:21 pm
Follow us on

Missamma Movie: అప్పట్లో అంటే.. తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎన్నో మహాచిత్రాలు అద్భుతమైన క్లాసిక్ చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల్లో మేటి చిత్రంగా ఇప్పటికీ మిగిలిపోయింది ‘మిస్సమ్మ’. ఈ చిత్రం దర్శకత్వ పరంగా కూడా గొప్ప చిత్రం అనిపించుకుంది. ఈ సినిమాలో ఉన్న మరో గొప్ప విషయం సున్నితత్త్వం.

కథలో వేరు మతాల ఉనికి, వ్యాఖ్యానం ఉన్నా, నొప్పించక తానొవ్వక అంటూ ఎంతో సున్నితంగా సాగుతుంది సినిమా. అన్నిటికి మించి సినిమా నటులెవ్వరూ నటిస్తున్నట్టు కాక, ఏదో మన కళ్ళ ముందు కదులుతూ సహజంగా ప్రవర్తిస్తున్నట్టే ఉంటుంది. ఇది కదా అద్భుతమైన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం అంటే.

మీకు తెలుసా ? తెలుగులో మొదలైన మొట్టమొదటి ద్విభాషా చిత్రం ఇది. తమిళంలోనూ వేరు ముఖ్య నటులతో ఏక కాలంలో అవే లోకేషన్లలో షూటింగ్ జరిపారు. అసలు ఈ కాలంలో ఊహించని మరో అంశం. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తోన్న సినిమాలో రేలంగి అనే ఒక హాస్యనటుడికి రెండు పాటలు పెట్టడం అంటే.. ఈ కాలంలో అది సాధ్యం కాదు.

పైగా రేలంగి గారి ‘సీతారాం, ధర్మం చెయ్ బాబు’ అనే పాటలు ఎంత వినోదంగా సాగుతాయి. పైగా ఈ పాటల అర్థంలో కూడా ఎంతో నిగూఢంగా, లోతుగా కూడా ఉంటాయి. ఇక మల్టీస్టారర్ చిత్రమైనా కథలోని సమతౌల్యాన్ని నిలబెడుతూ కథా గమనాన్ని దెబ్బ తీయకుండా నడిపించిన తీరు అయితే అద్భుతమే.

అందుకే ఈ సినిమా ఇప్పటికి క్లాసిక్ సినిమాగానే నిలిచిపోయింది. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో చాలామందికి చాలా అపోహలు ఉండేవి. అసలు ఈ సినిమా వర్కౌట్ అవుతుందా ? ఏదో నమ్మశక్యం కాని కథతో ఒక కామెడీ సినిమా చేశాము. ఇప్పుడెలా ? అంటూ అప్పట్లో నిర్మాతలు టెన్షన్ పడ్డారట. కానీ, ఈ సినిమా రిలీజ్ అయ్యాక గొప్ప విజయం సాధించింది.