పీవీ సింధూ రిటర్ మెంట్.. ట్విస్ట్ ఇచ్చిందిలా!

కరోనా వేళ అందరూ ఇబ్బందిపడ్డారు. ఆటలు పాటలు, ఎంటర్ టైన్ మెంట్, ఉద్యోగాలు, ఉపాధి అన్నీ బంద్ అయిపోయాయి. కొందరి ఈ కరోనా లాక్ డౌన్ తో విరక్తి పుట్టింది. అందులో మన ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్స్ విజేత పి.వి. సింధు కూడా ఒకరు. ఆ క్రమంలోనే అభిమానులకు షాకిస్తూ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఆమె విడుదల చేసిన లేఖలో చివరకు వరకు చూస్తే కానీ అసలు ట్విస్ట్ ఏంటనేది తెలియరాలేదు. పీవీ సింధూ తాజాగా […]

Written By: NARESH, Updated On : November 2, 2020 7:04 pm
Follow us on

కరోనా వేళ అందరూ ఇబ్బందిపడ్డారు. ఆటలు పాటలు, ఎంటర్ టైన్ మెంట్, ఉద్యోగాలు, ఉపాధి అన్నీ బంద్ అయిపోయాయి. కొందరి ఈ కరోనా లాక్ డౌన్ తో విరక్తి పుట్టింది. అందులో మన ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్స్ విజేత పి.వి. సింధు కూడా ఒకరు. ఆ క్రమంలోనే అభిమానులకు షాకిస్తూ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఆమె విడుదల చేసిన లేఖలో చివరకు వరకు చూస్తే కానీ అసలు ట్విస్ట్ ఏంటనేది తెలియరాలేదు.

పీవీ సింధూ తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. కరోనా వైరస్‌ కారణంగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా ఆమె వెల్లడించారు. ‘నేను రిటైర్‌ అయ్యాను. డెన్మార్క్‌ ఓపెన్‌ నా చివరి ఆట’ అని పీవీ సింధు ఈ సంధర్భంగా తెలిపారు.

అయితే ఆమె ప్రకటన భావోద్వేగ పూరితంగా ఉంది. ఆ ప్రకటనలో ‘కరోనా మహమ్మారి నాకు కనువిప్పుగా మారింది. నా ప్రత్యర్థితో పోరాడటానికి కఠోరమైన శిక్షణ తీసుకునేదాన్ని. చివరి వరకు పోరాడేదాన్ని. ఇంతకు ముందు చేశాను, ఇకపై కూడా చేయగలను.

అయితే రిటైర్ మెంట్ అనగానే ప్రతి ఒక్కరు ఇక పూర్తిగా ఆటకు దూరం అనుకున్నారు. కానీ లేఖలో కరోనాపై రిటైర్ మెంట్ తీసుకోవాలని పీవీ సింధూ ట్విస్ట్ ఇచ్చారు.

మొదట పీవీ సింధూ రిటైర్ మెంట్ ను చూసి అభిమానులు షాక్ కు గురయ్యారు. తర్వాత చదువుకొని అభిమానులు పీవీ సింధూపై మండిపడ్డారు.సమయం సందర్భం లేకుండా ఏంటీ వ్యంగ్య పోస్టులు ఆమెపై మండిపడ్డారు.

https://twitter.com/Pvsindhu1/status/1323196067450507265?s=20