Alia Butt : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు వారికి కూడా పరిచయం అయింది. స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని ఓ పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె తల్లి అయిన తర్వాతనే నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా అలియా భట్ మరోసారి అరుదైన ఘనత సాధించింది.
అలియా భట్ పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ షేర్ చేస్తుంటారు. తాజాగా ఇన్ల్ఫుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ పై హైప్ ఆడిటర్ విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోనే ఆమె అత్యంత ప్రభావవంతమైన నటిగా రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. హాలీవుడ్ దిగ్గజాలు డ్వేన్ జాన్సన్, జెన్నిఫర్ లోపెజ్‌లను అధిగమించి, జెండయా తర్వాత స్థానంలో అలియా నిలిచారు. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అలియాకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్‌స్టాలో ఈమెకు 85 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అలియా తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను నిరంతరం తన అభిమానులతో పంచుకుంటుంటారు. అంతేకాదు ఫొటో షూట్‌లతో ఆకట్టుకుంటారు. అలియా గతేడాది కూడా టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన వంద మోస్ట్ ఇన్‌ప్లూయెన్షియల్ పీపుల్ ఆప్ 2024 జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఆమె సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబం నుంచి వచ్చారు. తను ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తె . అలియా గంగూబాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్, రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ వంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగారు. 2022 ఏప్రిల్ 14న రణబీర్ కపూర్‌ని పెళ్లి చేసుకుని వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకుల అభిమానాలను పొందారు. చివరిగా అలియా జిగ్రాతో ప్రేక్షకులను అలరించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫౌజీ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మి్స్తున్నారు. ఈ సినిమాలో అలియా యువరాణి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.