Allu Arjun , Salman Khan
Allu Arjun and Salman Khan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం ఏలుతున్న వాళ్ళు మన తెలుగు హీరోలే కావడం విశేషం…ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్ హీరో పుష్ప 2 (పుష్ప 2) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు. 1950 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. ఇక దాంతో ఆయన తదుపరి చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ (Atle) డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంతకుముందే కన్ఫామ్ అయినప్పటికి కొన్ని అనుకోని కారణాలవల్ల ప్రాజెక్టు అనేది పక్కకెళ్ళిపోయింది.
ఇక దాంతో అట్లీ బాలీవుడ్ కండలవీరుడు అయిన సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ అల్లు అర్జున్ చేసిన పుష్ప 2 సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో సల్మాన్ ఖాన్ ను పక్కన పెట్టేసి అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి అట్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఈ ప్రాజెక్టు వచ్చే సంవత్సరం సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసే సినిమా మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకొని మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ అనేది ఇప్పుడు భారీ లెవెల్లో పెరిగిపోయింది.
స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా బాట పడుతుండడం వల్ల ఎవరు ఎలాంటి సక్సెస్ లని సాధించి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది… అల్లు అర్జున్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశాడు. అల వైకుంఠపురంలో, పుష్ప, పుష్ప 2 వంటి సినిమాలతో ఆయనకంటూ ఒక మంచి ఇమేజ్ ను అయితే సొంతం చేసుకున్నాడు…