Alia Bhatt: కరోనా సెకండ్ వేవ్ అనంతరం హిందీ పరిశ్రమ థియేటర్ రిలీజ్ కోసం చాలా కాలమే ఎదురుచూసింది. కానీ ప్రస్తుత పరిస్థితులు బాగుండటంతో మొత్తానికి బాలీవుడ్ సినిమాల రిలీజ్ కి మోక్షం లభించింది. ఈ క్రమంలో హిందీ పెద్ద సినిమాలు అన్నీ.. ఇప్పుడు ఒక్కొక్కటిగా పోటీ పడి మరీ రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తున్నాయి.

అయితే, ఏ సినిమాకి ఏ సినిమాకి పోటీ లేకుండా రాకుండా చాలా ప్లాన్డ్ గా రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పటి నుంచి వచ్చే ఏడాది దీపావళి వరకు విడుదల లైనప్ రెడీ అయిపోయింది. కాగా 2022లో మొదటి బోణి మాత్రం ఒక హీరోయిన్ ది కావడం విశేషం. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో క్రేజీ టాలెంటెడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన సినిమా “గంగూబాయి కతియావాడి”.
నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి అయింది. కరోనా కారణంగా ఇన్నాళ్లు ల్యాబ్ కే పరిమితం అయిన ఈ చిత్రం తాజాగా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని జనవరి 6, 2022న విడుదల చేయబోతున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంటే 2022లో బాలీవుడ్ లో మొదట విడుదలయ్యే సినిమా అలియా భట్ దే.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ హిందీ జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన పుస్తకం “మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై” ఆధారంగా ఈ సినిమాని అత్యున్నతమైన రీతిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పైగా ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అజయ్ దేవ్‌గన్ తో పాటు ఒకప్పటి బోల్డ్ హీరో ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు.
గంగూబాయిగా అలియా భట్ నటిస్తోంది. ఆమె ఒక వేశ్య గృహం నడిపే యజమానురాలు గా కనిపించబోతుంది. కాబట్టి అలియా భట్ గెటప్ అండ్ సెటప్ బాగా బోల్డ్ గా ఉండబోతుంది. అందుకే ఈ సినిమా పై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అలియా కెరీర్ లో కూడా ఇది ప్రత్యేకమైన సినిమా.
ఇక ఆలియా నటిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే, వచ్చే సంక్రాంతికి అలియా భట్ నుంచి గ్యాప్ లేకుండా వరుసగా రెండు భారీ చిత్రాలు రాబోతున్నాయి.