Prabhas: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ఆశ పెట్టుకుంది ఒక్క సంక్రాంతి సీజన్ మీదే. ఈ నేపథ్యంలోనే కొన్ని పెద్ద సినిమాలు సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి. కానీ, ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. సమీకరణాలు మారుతున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా సంక్రాంతికి ఇంతకుముందు ప్రకటించిన సినిమాలన్నీ తప్పుకునే పరిస్థితి వచ్చేలా ఉంది.

కారణం.. భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. రానున్న నాలుగు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది. అయితే, అంతకుముందే సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాల మాటేమిటి ? ఇప్పటికే రాజమౌళి టీం తమ సినిమా రిలీజ్ విషయంలో ఆయా పెద్ద సినిమాల నిర్మాతలకు తమ నిర్ణయాన్ని తెలియజేశారు.
దాంతో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను చూసుకోక తప్పట్లేదు. స్వతహాగా ఇలాంటి విషయాల్లో మహేష్ బాబు చాలా పట్టుదలగా ఉంటాడు. ఎట్టిపరిస్థితుల్లో తగ్గేదే లేదు అంటాడు. కానీ, రాజమౌళితో మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే మహేష్ తన సినిమా రిలీజ్ విషయంలో కాస్త కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తోంది.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా కూడా కొత్త రిలీజ్ డేట్ ను చూసుకోబోతుంది. ఆర్ఆర్ఆర్ కి పోటీగా మేము రిలీజ్ చేసే ఆలోచనలో లేము అంటూ ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు వెనక్కి తగ్గారు.
అయితే, నేషనల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ నిర్మాతలు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటున్నారు. రాజమౌళి టీమ్ తో ‘మా రిలీజ్ డేట్ మారదు, మీ ఆర్ఆర్ఆర్’ సినిమా సంక్రాంతికి పోటీలో ఉన్నా, మా నిర్ణయం మారదు’ అని తేల్చి చెప్పారట. పైగా ఈ రోజు రాధేశ్యామ్ టీం మరోసారి తమ రిలీజ్ డేట్ జనవరి 14 అంటూ మళ్ళీ అనౌన్స్ చేసింది.
దీన్ని బట్టి, పవన్, మహేష్ వెనక్కి తగ్గినా ప్రభాస్ తగ్గేలా లేడు. కాబట్టి.. సంక్రాంతికి ‘రాధే శ్యామ్’ – ‘ఆర్ఆర్ఆర్’ మధ్య తీవ్రమైన బాక్సాఫీస్ పోటీ నెలకొంది. కచ్చితంగా ఆర్ఆర్ఆర్ కే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అనడంలో సందేహం లేదు అనుకోండి.