Alia Bhatt : అతి చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్ గా ఎన్నో సక్సెస్ లు చూసి పాన్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్స్ లో ఒకరిగా అలియా భట్(Alia Bhatt) నిల్చిన సంగతి తెలిసిందే. ఈమె ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్(Ranbir Kapoor) తో నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్ళైన కొన్ని నెలలకే ఈ క్యూట్ జంటకు ‘రాహా'(Raaha) అనే బిడ్డ పుట్టింది. చూసేందుకు ఎంతో క్యూట్ గా అనిపిస్తున్న ఈ చిన్నారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే మనం చాలా చూసాము. విమానాశ్రయం లో తన కూతుర్ని తీసుకెళ్తున్న సమయం లో ఫొటోగ్రాఫర్లు ఎన్నో వీడియోలు తీశారు. అందులో రాహా అభిమానులకు ‘హాయ్..బాయ్’ అని చెప్తూ ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ కనిపించిన వీడియో ఎంత వైరల్ గా మారిందో మనమంతా చూసాము. అయితే ఏమైందో ఏమో తెలియదు అలియా భట్ రీసెంట్ గానే తన కూతురుకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తొలగించేసింది.
Also Read : కూతురి ఫోటోలను ఇంస్టాగ్రామ్ నుండి తొలగించిన అలియా భట్..కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఒక ప్రముఖ బాలీవుడ్ టాక్ షో లో పాల్గొన్నది. ఈ టాక్ షోలో త్వరలోనే రెండవ సారి తల్లి కాబోతున్నట్టు పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేసింది. రాహా పుట్టి రెండేళ్లు అయిపోయింది, ఇప్పుడు మాకు అబ్బాయి కావాలి అంటూ ఆమె తన కోరికను వెళ్లబుచ్చింది. అంతే కాదు రాహా పుట్టకముందే, పేరు ఏమి పెట్టాలి అనేది నిర్ణయించేసుకున్నారట. ప్రెగ్నన్సీ అనే విషయం తన బంధు మిత్రులకు తెలియగానే, పేరు విషయం లో అనేక సలహాలు ఇచ్చారని, వాటి నుండి మా అత్త గారు రాహా అనే పేరుని సూచించింది అని, మాకు కూడా బాగా నచ్చడంతో ఆ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాము అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకు రాహా అంటే అర్థం ఏమిటంటే శాంతి, సంతోషం అట.
అదే విధంగా పుట్టబోయే కొడుకు కోసం కూడా ఒక పేరు ఫిక్స్ చేశామని అలియా భట్ చెప్పుకొచ్చింది. ఏ పేరుని ఫిక్స్ చేసారో బహిరంగంగా బయటకు చెప్పలేదు కానీ, త్వరలో బిడ్డని కనాలి అనే ఉద్దేశ్యం ఉండబట్టే, ముందుగానే పేరుని నిర్ణయించుకున్నారని సోషల్ మీడియా లో అభిమానులు అనుకుంటున్నారు. అంతే కాదు అలియా భట్ ప్రస్తుతం గర్భం దాల్చిందని, త్వరలోనే రెండవ బిడ్డకు జన్మని ఇవ్వబోతుందని కూడా నిర్ధారించారు. చూడాలి మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది. తల్లి అయిన తర్వాత అలీ భట్ నుండి ‘జిగ్ర’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. మరోపక్క రణబీర్ కపూర్ ‘ఎనిమల్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. అంతే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా భావించిన ‘రామాయణం’ లో ఆయన రాముడి క్యారక్టర్ చేస్తున్నాడు.
Also Read : అక్షరాలా 1 కోటి టిక్కెట్లు..చరిత్ర సృష్టించిన ‘చావా’..ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ ఎంతంటే!