Ambassador : అంబాసిడర్.. మార్కెట్లోకి ఎన్ని కార్లు వచ్చిన ఆ కారు మాత్రం ఎవ్వరూ మర్చిపోలేరు. 90వ దశకంలో భారతీయ మార్కెట్లో ఈ కారు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ కారు రాజసానికి సింబల్ గా ఉండేది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినిమా తారలు ఇలా సెలబ్రిటీలంతా ఈ కార్లనే వాడేవారు. ఈ కారులో వెళ్తుంటే అందరూ వాళ్లను చాలా గొప్పగా చూసే వాళ్లు. ఈ కారు ఉన్న వాళ్లను అంతా ధనవంతులని అనుకునే వాళ్లు. ఇప్పటికీ పాత సినిమాల్లో ఈ కారు కచ్చితంగా కనిపిస్తుంది. అంబాసిడర్‌ను చాలా మంది స్టేటస్ సింబల్ కోసం వాడేవాళ్లు. ఒకప్పుడు రోడ్లను ఏలిన కారు ఇప్పుడు కనీసం కనిపించడం లేదు. నాటి కాలం కార్లను ఎక్కడో ఓ చోట మోడీ ఫై చేసి వాడుతుంటారు. ఇక కొంతమంది తమకు ఇష్టమైన కారును వదులుకోలేక తమ గ్యారేజీలో పెట్టుకున్నారు.
Also Read : 1964 నాటి అంబాసిడర్ కారు .. దీని ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
అంబాసిడర్ కార్ల ఉత్పత్తి 1957లో హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేయడం ఈ ప్రారంభమైంది. అప్పట్లో ఇదో సంచలనం. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఉత్పత్తిని 2014లో ఆపేశారు. మార్కెట్లోకి కొత్త మోడల్స్ అందుబాటులోకి రావడం, వినియోగదారుల ఇష్టాలు మారిపోవడంతో కంపెనీకి ఇబ్బందులు మొదలయ్యాయి. వినియోగదారులు ఇష్టాలు కూడా మారిపోవడంతో అంబాసిడర్ కారు కొనేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కానీ ఇప్పటికీ కొంతమందికి మాత్రం అంబాసిడర్ అంటే తెలియని అభిమానం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అంబాసిడర్ కారు దాదాపు 57ఏళ్లుగా అమ్మకాలను కొనసాగించింది. అన్ని కార్ల మాదిరిగానే అంబాసిడర్ కారును కూడా అప్ డేట్ చేసి మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అయితే చాలా సార్లు ఈ కొత్త అంబాసిడర్ విడుదలపై రకరకాల వార్తలు వచ్చాయి. కానీ కొత్త కారు ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం క్లారిటీ రాలేదు.
తాజా సమాచారం ప్రకారం అంబాసిడర్ త్వరలో తిరిగి మార్కెట్లోకి వస్తుందని సమాచారం. ప్రస్తుతం అంబాసిడర్ బ్రాండ్ పేరును వాడుకునే హక్కులన్ని కూడా పీఎస్ ఏ గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఫ్రెంచ్ కార్ల కంపెనీ అయిన దీనికింద చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీ ఇటీవల అంబాసిడర్ కారును తిరిగి తీసుకు రావాలని భావిస్తోంది. భారత్ మార్కెట్ విలువ చాలా పెద్దదన్న సంగతి తెలిసిందే. భారత ఆటోమొబైల్ మార్కెట్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. తర్వలో ఫస్ట్ ప్లేసుకు వెళ్లనుంది. మరి ఇంత డిమాండ్ ఉన్న మార్కెట్లోకి ఒకప్పుడు మార్కెట్ ను శాసించిన అంబాసిడర్‌ను కొత్తగా మాడీ ఫై చేసి రిలీజ్ చేయడం ద్వారా గత సెంటిమెంట్ పని చేస్తుందని పీఎస్ ఏ కంపెనీ భావిస్తుంది. అందుకే ఈ కారు తిరిగి తేవాలని చూస్తుంది.
ఈ కారును వచ్చే ఏడాది మార్చితో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కారు ధర.10లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
Also Read : Kia నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ తెలిస్తే ఫిదా అవుతారు..