Free Bus Scheme : కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం(Free Bus Scheme) పై ఇచ్చిన మాటను తప్పనుందా?, తెలంగాణ లో ఈ పథకం కారణంగా ప్రభుత్వం పై తీవ్రమైన నెగిటివిటీ రావడాన్ని చూసి , మెల్లగా ఈ పధకానికి పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుందా?, నేడు మంత్రి గుమ్మడి సంధ్య రాణి(Minister Gummadi Sandhya Rani) శాసన మండలి(Legislative Council) లో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ఉచిత బస్సు పథకం ఏ జిల్లాకు సంబంధించిన మహిళలు, ఆ జిల్లాలో పర్యటించడానికి మాత్రమే. ఒక జిల్లా నుండి మరో జిల్లాకు పర్యటించడానికి కాదు, అలా మేము ఎప్పుడూ చెప్పలేదు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇలా చేయలేదు. మహిళలకు తెలంగాణ లో ఒక చోట నుండి మరో చోటకు ఎక్కడికి వెళ్లినా ఉచితమే. దీని వల్ల లాభాలు కంటే నష్టాలే ఎక్కువ జరిగాయి. ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి.
Also Read : మహిళలకు షాక్.. ఏపీలో ఆ పథకం ఇప్పట్లో లేనట్టే!
అందుకే పథకం ఎప్పటి నుండి అమలు చేయబోతున్నారు అనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ పథకం పై ప్రభుత్వం విధి విధానాలు ఎలా ఉండబోతుందో ఈరోజు మంత్రి వ్యాఖ్యలతో అర్థం అవుతుంది. సూపర్ 6 లో ప్రస్తుతం సామజిక పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ పథకాలు అమలు అయ్యాయి. మిగిలిన పథకాలలో అత్యంత కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటివి మే నెల నుండి ప్రారంభించబోతున్నట్టు ఇప్పటికే అసెంబ్లీ లో పలు మార్లు కూటమి నేతలు అధికారికంగా ప్రకటించారు. మరి ఎంతమేరకు ఈ పధకాలను అమలు చేస్తారు?, ఇచ్చిన మాట మీద నిలబడుతారా లేదా అనేది చూడాలి. ఆరు నెలలు జనాలు కూడా ఈ పథకాల గురించి అడగలేదు. కొత్త ప్రభుత్వం కదా, కాస్త సర్దుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కానీ ఆరు నెలల తర్వాత ఈ పథకాలు గురించి అడగడం మొదలు పెట్టారు, జనాల్లో నెగెటివిటీ పెరిగింది.
ఉచిత బస్సు ప్రయాణం పై ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి జనాలు చేయడం లేదు కానీ, ‘తల్లికి వందనం’ పథకం పై మాత్రం చాలా గట్టి ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే మాజీ సీఎం జగన్, ప్రభుత్వాన్ని స్థాపించిన ఆరు నెలలకు ఈ పధకాన్ని ప్రారంభించాడు. కానీ కూటమి ప్రభుత్వానికి ఆరు నెలలు దాటి 9 వ నేలలోకి అడుగుపెడుతుంది. బడ్జెట్ లో ఈ పధకానికి 9 వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు. మే నెలలో ఒక కుటుంబం లో ఎంతమంది అమ్మాయిలు ఉంటే అంత మందికి 15 వేల రూపాయిలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తే కూటమి కి తిరుగు ఉండదు. చేయకపోతే మాత్రం ఘోరమైన నెగటివిటీ ని ఎదురుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రమైన నెగటివిటీ ఉందని రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా అందరికీ అర్థమైంది, కూటమి ప్రభుత్వం ఆ స్థాయికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుందో లేదో చూడాలి.
Also Read : ఏపీలో నియోజకవర్గాల పెంపు.. కీలక ప్రతిపాదనలతో ఢిల్లీకి చంద్రబాబు!
ఉచిత బస్సు కూడా గోవిందా.. ఆడవాళ్లకి చెప్పిన అన్ని హామీల్లోనూ మోసం చేసిన బాబు pic.twitter.com/VGKiKli3sv
— Graduate Adda (@GraduateAdda) March 7, 2025