ఆల వైకుంఠపురంలో మంచి రేటుకి అమ్ముడుపోయింది

బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ” ఆల వైకుంఠపురం లో ” చిత్రం యొక్క హిందీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబట్టింది. దాంతో హిందీ నిర్మాతల చూపు ఈ సినిమా ఫై పడింది . త్రివిక్రమ్ , బన్నీ కాంబో లో వచ్చిన ఈ చిత్రం వారికి ఈ హ్యాట్రిక్ మూవీ కాగా ఈ […]

Written By: admin, Updated On : April 7, 2020 4:26 pm
Follow us on


బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ” ఆల వైకుంఠపురం లో ” చిత్రం యొక్క హిందీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబట్టింది. దాంతో హిందీ నిర్మాతల చూపు ఈ సినిమా ఫై పడింది . త్రివిక్రమ్ , బన్నీ కాంబో లో వచ్చిన ఈ చిత్రం వారికి ఈ హ్యాట్రిక్ మూవీ కాగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ.220 కోట్ల పైగా వసూళ్లను సాధించి నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది.

‘అల వైకుంఠపుములో’ సక్సెస్ చూసిన బాలీవుడ్ మేకర్ అశ్విన్ వర్దే ఈ సినిమా రీమేక్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నాడట. సుమారు 8 కోట్లతో అశ్విన్ వర్దే ఈ చిత్రం యొక్క రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడట. నిజానికి ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ హిందీ లో రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకున్నాడట..కానీ లేటెస్ట్ సమాచారం మేరకు అల వైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్ హక్కులు కబీర్ సింగ్ ( హిందీ అర్జున్ రెడ్డి) నిర్మాత అయిన అశ్విన్ వర్దే దక్కించు కొన్నాడని తెలిసింది. కాగా హిందీ వెర్షన్ లో బన్నీ పాత్రని అక్షయ్ కుమార్ పోషించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. remaes are safe bets