
‘మజిలీ , వెంకీ మామ’ చిత్రాల విజయం తో నాగ చైతన్య సినీ నిర్మాతల దృష్టిని బాగా ఆకర్షించాడు. ఇపుడు పెద్ద పెద్ద నిర్మాతలు అక్కినేని నాగచైతన్య కాల్ షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నాగ చైతన్య మాత్రం తొందర పడకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఆ క్రమంలో ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో `లవ్ స్టోరీ ` అనే చక్కటి ప్రేమ కథా చిత్రం చేస్తున్నాడు.దాదాపు షూటింగ్ మొత్తం ఫినిష్ చేసుకొన్న ఈ చిత్రం కరోనా వైరస్ హడావిడి తగ్గిన తర్వాత విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తరవాత నాగ చైతన్య పరుశురామ్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఫై సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. కాగా ఈ సినిమాకు ” నాగేశ్వరరావు” అనే టైటిల్ కూడా పెట్టారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. అంతా ఓకే అనుకుంటోన్న తరుణంలో ప్రిన్స్ మహేష్ బాబు నుంచి పిలుపు రావడంతో దర్శకుడు పరుశురామ్ ప్రిన్స్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. దీంతో `నాగేశ్వరరావు ` మూవీ నిర్మాణం సందిగ్ధం లో పడింది.
అయితే నాగచైతన్య తమకు కేటాయించిన డేట్స్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్ వేస్ట్ చేయదలుచుకోలేదు. ఆ కాల్ షీట్స్ ని దిల్ రాజు కి ఇచ్చేందుకు రెడీ అయ్యింది . ఆ క్రమంలో దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయడానికి నాగచైతన్య కూడా ఆసక్తి గా ఉన్నాడట. ఆ క్రమంలో రైటర్ కం డైరెక్టర్ బీవీఎస్ రవి చెప్పిన ఓ కథను నాగచైతన్య ఓకే చేసాడట …కాగా ఆ చిత్రాన్నిమనం ఫేమ్ విక్రమ్ కుమార్ తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది.