https://oktelugu.com/

ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిన యూట్యూబ్… గందరగోళంలో యూజర్లు.!!

ఉదయం లేచినప్పటి నుంచి యూట్యూబ్ లో వీడియోలను అప్లోడ్ చేస్తూ వివిధ ఛానల్స్ లో వీడియోలను చూస్తూ చాలామంది వారి సమయాన్ని కేటాయిస్తుంటారు. చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనీ వారికి నచ్చిన వీడియో లను చూస్తారు. ఎంతోమంది యూజర్లను కలిగి ఉన్న యూట్యూబ్ లో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో యూట్యూబ్ యూజర్లు ఆందోళనకు గురయ్యారు. Also Read..డిజిటల్ మీడియా గొంతు నొక్కేందుకు కేంద్రం ప్లాన్? యూట్యూబ్ ద్వారా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 12, 2020 2:36 pm
    Follow us on

    you tube shutdown

    ఉదయం లేచినప్పటి నుంచి యూట్యూబ్ లో వీడియోలను అప్లోడ్ చేస్తూ వివిధ ఛానల్స్ లో వీడియోలను చూస్తూ చాలామంది వారి సమయాన్ని కేటాయిస్తుంటారు. చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనీ వారికి నచ్చిన వీడియో లను చూస్తారు. ఎంతోమంది యూజర్లను కలిగి ఉన్న యూట్యూబ్ లో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో యూట్యూబ్ యూజర్లు ఆందోళనకు గురయ్యారు.

    Also Read..డిజిటల్ మీడియా గొంతు నొక్కేందుకు కేంద్రం ప్లాన్?

    యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ వీడియో ఆధారిత సేవలకు అంతరాయం కలగడంతో కొన్ని గంటల నుంచి యూట్యూబ్ లో ఆన్ లైన్ వీడియోలు చూడడానికి సమస్యలు ఎదురయ్యాయి.దీంతో ఒక్కసారిగా అయోమయంలో ఉన్న యూట్యూబ్ యూజర్లు కేవలం వారి ఛానల్ మాత్రమే ఆగిపోయాయి అనుకున్నారు. కానీ కొంత సమయానికి అన్ని చానల్స్ ఆగిపోవడంతో యూట్యూబ్ లో ఏదో సాంకేతికలోపం తలెత్తినట్లు యూజర్లు భావిస్తున్నారు.

    ఈ సమస్య పై స్పందించిన యూట్యూబ్ సమస్థ కేవలం భారతదేశంలోనే కాకుండా పలుదేశాలలో కూడా సాంకేతిక లోపం కారణం వల్ల ఆన్లైన్ వీడియోలు ప్రసారం కాలేదని తెలిపింది. ఆస్ట్రేలియా, జపాన్, కెనడా వంటి దేశాలలో కూడా యూట్యూబ్ సేవలు నిలిచిపోయిన ట్లు పేర్కొన్నారు. అయితే కేంద్రం యూట్యూబ్ కంటెంట్ పై ఫోకస్ చేసినట్లుగా సమాచారం వచ్చిన తర్వాత రోజే యూట్యూబ్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు ఎంతో కంగారు పడుతున్నారు.

    Also Read..డిజిటల్ మీడియాపై కేంద్రం ఫోకస్.. అశ్లీలతను అడ్డుకునేందుకేనా?

    అయితే యూట్యూబ్ సాంకేతిక బృందాలు యూట్యూబ్ లో ఏర్పడిన అంతరాయాలను నిర్మూలించేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నాయి.వెంటనే రంగంలోకి దిగిన ఈ బృందం ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కానీ ఈ సాంకేతికలోపం ఎందువల్ల తలెత్తింది అన్న విషయం మాత్రం తెలియడం లేదు.త్వరలోనే యూట్యూబ్ లో ఏర్పడిన సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని యూట్యూబ్ ను యూజర్లు కోరుతున్నారు.