https://oktelugu.com/

మరోసారి విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సాయమందించేందుకు పలువురు సెలబెట్రీలు ముందుకొచ్చారు. ఈమేరకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తనవంతు సాయంగా ప్రధానమంత్రి సహాయనిధికి 25కోట్ల భారీ విరాళాన్ని అందించిన సంగతి తెల్సిందే. అంతటితో ఆగిపోకుండా కరోనాపై పోరాడుతున్న వారికి సాయం అందిస్తున్నాడు. ఈనేపథ్యంలో ముంబైలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న పోరాటాన్ని గుర్తించి అక్షయ్ కుమార్ ముంబై మున్సిల్ కార్పొరేషన్ రూ.3కోట్ల విరాళాన్ని అందించి గొప్పమనస్సును చాటుకున్నాడు. తాజాగా మరోసారి రూ.2కోట్ల […]

Written By: , Updated On : April 28, 2020 / 06:40 PM IST
Follow us on


దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సాయమందించేందుకు పలువురు సెలబెట్రీలు ముందుకొచ్చారు. ఈమేరకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తనవంతు సాయంగా ప్రధానమంత్రి సహాయనిధికి 25కోట్ల భారీ విరాళాన్ని అందించిన సంగతి తెల్సిందే. అంతటితో ఆగిపోకుండా కరోనాపై పోరాడుతున్న వారికి సాయం అందిస్తున్నాడు. ఈనేపథ్యంలో ముంబైలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న పోరాటాన్ని గుర్తించి అక్షయ్ కుమార్ ముంబై మున్సిల్ కార్పొరేషన్ రూ.3కోట్ల విరాళాన్ని అందించి గొప్పమనస్సును చాటుకున్నాడు.

తాజాగా మరోసారి రూ.2కోట్ల భారీ విరాళాన్ని అక్షయ్ కుమార్ ప్రకటించాడు. ఇటీవల ముంబైలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు కరోనా సోకి మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న అక్షయ్ కుమార్ వారి సేవలను గుర్తించి కొనియాడారు. ఈమేరకు ముంబై పోలీసు ఫౌండేషన్ కు రూ.2కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అక్షయ్ కుమార్ సాయంపై ముంబై సీపీ అక్షయ్‌కి ట్వీటర్లో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాజాగా అక్షయ్ ప్రకటించిన విరాళాన్ని కలుపుకుంటే మొత్తంగా 30కోట్లు అవుతోంది. ఇంతపెద్దమొత్తంలో విరాళం అందించడంతో ఆయనపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్షయ్ రియల్ హీరో అంటూ అభిమానులు కొనియాడుతున్నారు.