https://oktelugu.com/

OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ హీరోల భారీ యాక్షన్ ఎంటర్టైనర్… ఫ్యాన్స్ కి పండగ, ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

OTT Release: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ ' బడే మియా చోటే మియా ' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్, టీజర్ కి మంచి స్పందన రావడంతో ఈసారి అక్షయ్ హిట్ కొట్టడం పక్కా అని ఫ్యాన్స్ భావించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 6, 2024 / 06:49 PM IST

    Bade Miyan Chote Miyan OTT release announced!

    Follow us on

    OTT Release: అక్షయ్ కుమార్(Akshay Kumar), టైగర్ ష్రాఫ్(Tiger Shroff) ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ బడే మియా చోటే మియా'(Bade Miyan Chote Miyan). ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓటిటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఈ మల్టీస్టారర్ ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది? ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుంది? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గత కొన్నేళ్లుగా హిట్ లేక అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

    బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ ‘ బడే మియా చోటే మియా ‘ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్, టీజర్ కి మంచి స్పందన రావడంతో ఈసారి అక్షయ్ హిట్ కొట్టడం పక్కా అని ఫ్యాన్స్ భావించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 11న ‘ బడే మియా చోటే మియా ‘ విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ వినిపించింది. కథ కూడా రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులు సినిమా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.

    Also Read: Love Mouli: ఆర్ ఆర్ ఆర్ స్టోరీకి ‘‘లవ్ మౌళి’’ సినిమా డైరెక్టర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

    దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నష్టాలను చవి చూసింది. కేవలం రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ నష్టాలు మిగిల్చింది. టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటించాడు. ఈ యాక్షన్ డ్రామా ‘ బడే మియా చోటే మియా ‘ ఇప్పుడు ఓటిటీ విడుదలో స్ట్రీమ్ అవుతుంది. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన 50 రోజులకు ఓటీటీలోకి వస్తుంది.

    Also Read: Anasuya: వయసులో అనసూయ ఎలా ఉండేదో తెలుసా… సంచలన ఫోటోలు వైరల్

    ఇక స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే .. ఈ చిత్రం జూన్ 6వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. బడే మియా చోటే మియా మూవీలో మానుషీ చిల్లర్, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటించారు. మలయాళ నటుడు సలార్ ఫేమ్ పృథ్వి రాజ్ విలన్ గా నటించారు. సోనాక్షి సిన్హా కీలక పాత్రలో కనిపించారు. మరి ఈ సినిమాకి ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ లభిస్తుందో వేచి చూడాలి.