Modi Govt : అందరి నోట్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే..? మోడీ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుందా? ఉండదా? స్థిరంగా ఉంటుందా? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఏ పార్ట్ నర్స్ లేఖలు ఇచ్చారు. రాష్ట్రపతిని కలిసి ఆ లెటర్లతో ప్రభుత్వ ఏర్పాటుకు మోడీ 9వ తేదీన నిర్ణయించారు.
మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పగటి కలలు కంటోంది. ఎలా అయినా సరే మేం మిగతా వారిని దగ్గరకు పరుచుకొని కుట్రలు పన్నుతున్నట్టు అర్థమవుతోంది.
మెజార్టీకి 32 సీట్లు బీజేపీకి తగ్గాయి. 240 సీట్లతో దేశంలో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా బీజేపీ ఉంది. ఇదే కాంగ్రెస్ కేవలం 99 సీట్లు మాత్రమే సాధించింది. అయితే ఎన్డీఏ కూటమి తరుఫున బీజేపీతో పొత్తు పెట్టుకొని పార్టీలు పోటీచేశాయి. కాబట్టి వీళ్లు గెలిచిన సీట్లు 293 అని చెప్పొచ్చు.
ఇక ఇండియా కూటమి మొత్తం చూస్తే 234 సీట్లు ఉన్నాయి. 38 సీట్లు షార్టేజ్ ఉన్నాయి.
అయితే సంకీర్ణ ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వ ప్రాధామ్యాల్లో మార్పులు జరుగుతాయా? లేదా అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.