Akshay Kumar Rana pan India movie: బాలీవుడ్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టింది. ఉజ్జయిని టెంపుల్ ఆధారంగా తీసుకొని , ఒక భారీ బడ్జెట్ పీరియాడికల్ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) ‘ధర్మ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు మరెవరో కాదు, ‘కార్తికేయ 2’, ‘తండేల్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన చందు మొందేటి. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar), రానా దగ్గుబాటి(Rana Daggubati) కాంబినేషన్ లో ఈ హిస్టారికల్ పీరియడ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. బాలీవుడ్ లో నిజ జీవితం లో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ప్రతీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అందుకు ది బెస్ట్ ఉదాహరణ ‘ధురంధర్’ సిరీస్.
మన ఇండియా లో జరిగిన కొన్ని ఉగ్ర దాడులను ఆధారంగా తీసుకొని, కల్పిత కథ తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆదిత్య డర్ తీర్చి దిద్దిన తీరుకి ప్రేక్షకులు సెల్యూట్ చేశారు. ఇప్పుడు పూర్తిగా ఉజ్జయిని టెంపుల్ ఆధారంగా సినిమా తీస్తుండడంతో కచ్చితంగా ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో హిస్టరీ ని నెలకొల్పుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో మరో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడట. మరి ఆ సూపర్ స్టార్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ ఏడాది లోనే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అక్షయ్ కుమార్ రీసెంట్ గానే ‘భూత్ బంగ్లా ‘ అనే చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రానికి భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.
ఈ సినిమా థియేటర్స్ లో ఉండగానే ఈ రేంజ్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ని సెట్ చేశాడు. ఇది నిజంగా ఆయన అభిమానులకు ఒక పండుగ లాంటి వార్త అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక రానా విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆయన ‘జై హనుమాన్’ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో హీరో అక్షయ్ కుమార్ తో సమానమైన క్యారెక్టర్ చేస్తున్నాడు. చూస్తుంటే భవిష్యత్తులో రానా దగ్గుబాటి కెరీర్ మళ్లీ పీక్ రేంజ్ కి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.