Mahesh Babu as Lord Rama look: ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) శ్రీరాముడి లుక్ లో కనిపించబోతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ తరం హీరోల్లో శ్రీరాముడి లుక్ లో ఎవరు పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు అనే ప్రశ్న వస్తే అందరికీ గుర్తుకు వచ్చే పేరు మహేష్ బాబు దే. ఆయన ముఖం శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు పాత్రలకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అభిమానులు అయితే మహేష్ బాబు పుట్టినరోజు సమయం లో శ్రీరాముడి లుక్ లో ఫోటో షాప్ చేసి బ్యానర్స్ కూడా వేస్తుంటారు. ఎన్ని విధాలుగా ఫోటో షాప్ చేసినా మహేష్ బాబు శ్రీ రాముడిగా అద్భుతంగా కనిపిస్తాడు. అలాంటిది ఇక రాజమౌళి విజన్ లోని మహేష్ బాబు ఎలా ఉంటాడో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు AI టెక్నాలజీ ఏ రేంజ్ లో వ్యాప్తి చెందిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
AI ద్వారా మనకి కావాల్సినట్టుగా ఇమేజీలను క్రియేట్ చేసుకోవచ్చు. అలా మహేష్ బాబు కి సంబంధించిన శ్రీరాముడి AI గెటప్ ఇమేజ్ ని బాలీవుడ్ లో ఒక సూపర్ హిట్ సినిమాలో వాడుకున్నారు. రీసెంట్ గానే అక్షయ్ కుమార్ హీరో గా నటించిన ‘భూత్ బంగ్లా’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. విడుదలై వారం రోజులు కూడా అవ్వకముందే ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ మూవీ అక్షయ్ కుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ చిత్రం లోని ఒక సన్నివేశం బ్యాక్ గ్రౌండ్ లో శ్రీ రాముడి ఫోటో పెద్దది ఒకటి గోడ మీద ఉంటుంది. ఆ ఫోటోని బాగా గమనిస్తే అచ్చు గుద్దినట్టు మన మహేష్ బాబు పోలికలే కనిపిస్తాయి.
అంటే ఆ చిత్ర డైరెక్టర్ మహేష్ బాబు లుక్ ని AI ద్వారా వాడుకొని ఇలా శ్రీరాముడి ఇమేజ్ ని క్రియేట్ చేసాడు అన్నమాట. ఇలా AI ద్వారా క్రియేట్ చేయబడిన శ్రీరాముడి గెటప్ కి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే, ఇక రేపు రాజమౌళి తన విజన్ తో మహేష్ ని రాముడి గా చూపించబోయే లుక్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు శ్రీరాముడు అంటే ఎన్టీఆర్, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఇళ్లల్లో కూడా శ్రీరాముడి గెటప్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఫోటోలని పటాలుగా వాడుకునేవారు. ఇప్పుడు రాజమౌళి పర్ఫెక్ట్ గా శ్రీరాముడి గెటప్ లో మహేష్ బాబు ని ప్రెజెంట్ చేస్తే, అప్పటి హిస్టరీ మరోసారి రిపీట్ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.
Lord Rama in this image looks like Super Star Krishna & #MaheshBabu.
This is from #BhoothBangla (2026). pic.twitter.com/2CLebEMTQG
— CineManiac (@movie__maniac) April 22, 2026