Ustaad Bhagat Singh Netflix views: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). ఉగాది కానుకగా మార్చి 19 న విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ కారణంగా ఈ సినిమాకు ఓపెనింగ్స్ రాలేదు , లాంగ్ రన్ అయితే అత్యంత దారుణం , వంద కోట్ల గ్రాస్ ని అందుకోవడానికి ఎన్నో తిప్పలు పడాల్సి వచ్చింది. హరీష్ శంకర్ నాసిరకపు టేకింగ్ , తేరి రీమేక్ అనే ప్రచారం ఈ సినిమా కొంపముంచింది. ప్రతీ సన్నివేశం కూడా ‘అరెరే ..ఇది ఎక్కడో చూశామే..ఆ చిత్రం నుండి కాపీ కొట్టేశాడుగా’ అని చూసే ఆడియన్స్ కి అనిపిస్తుంది. అందుకే ఈ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే ఈ చిత్రాన్ని రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ తో ఇలంటి నీచపు సినిమా చెయ్యాలని ఎలా అనిపించింది?, అసలు పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పుకున్నాడు , ఇలాంటి సన్నివేశాలు ఎవరైనా స్టార్ హీరో తో తీస్తారా?, తేరి ని మక్కీకి మక్కీ దించినా ఇంత చెత్తగా ఉండేది కాదు కదా అంటూ ఇష్టమొచ్చిన రేంజ్ పోస్టులు పెడుతూ హరీష్ శంకర్ ని ఏకిపారేశారు. అయినప్పటికీ కూడా ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్ లో భారీ రేంజ్ లోనే వ్యూస్ సొంతం అయ్యాయి. నెట్ ఫ్లిక్స్ సంస్థ అందిస్తున్న గణాంకాల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి కేవలం 4 రోజుల్లోనే 25 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది ఒక విధంగా బెస్ట్ రెస్పాన్స్ అనే చెప్పొచ్చు.
ఎందుకంటే ఈ సినిమా మీద వచ్చినన్ని ట్రోల్స్ , ఏ సినిమాకు కూడా రాలేదు. ‘ఓజీ’ ప్రభావం వల్ల, ఇతర భాషలకు సంబంధించిన ఆడియన్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని కూడా అత్యధికంగా చూసి ఉంటారని , అందుకే అంతటి వ్యూస్ వచ్చాయని అంటున్నారు. ‘ఓజీ’ చిత్రానికి మొదటి నాలుగు రోజుల్లో 32 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ‘ఓజీ’ తో పోలిస్తే 7 లక్షల వ్యూస్ తక్కువ వచ్చినప్పటికీ కూడా, వచ్చిన ఫ్లాప్ టాక్ కి ఈ మాత్రం రావడం చాలా గ్రేట్ అని అంటున్నారు. అంతే కాదు , ప్రస్తుతానికి ఈ చిత్రం 15 దేశాల్లో ట్రెండ్ అవుతోంది. రాబోయే రోజుల్లో ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.