https://oktelugu.com/

ఇండియా నుంచి అక్షయ్ కుమార్ ఒక్కడే

స్టంట్ మాస్టర్ నుంచి నటుడిగా మారి బాలీవుడ్‌ సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో అక్షయ్ కుమార్. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ఈ మధ్య వరుస హిట్లతో దూసుకుపోతున్నడు అక్షయ్. సూపర్ సక్సెస్ రేట్‌తో బాలీవుడ్ ఖాన్ త్రయం.. సల్మాన్, షారూక్, అమిర్ లను వెనక్కునెట్టిన ఈ ఖిలాడీ నంబర్ వన్‌ హీరోగా మారిపోయాడు. తన నటనతోనే కాకుండా మంచి మనసుతో అభిమానుల హృదాయాలు గెలుచుకోవడంలోనూ అతను ముందుంటాడు. నరనరానా దేశ భక్తి నింపుకున్న అక్షయ్‌ సైనికుల […]

Written By:
  • admin
  • , Updated On : June 5, 2020 5:21 pm
    Follow us on


    స్టంట్ మాస్టర్ నుంచి నటుడిగా మారి బాలీవుడ్‌ సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో అక్షయ్ కుమార్. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ఈ మధ్య వరుస హిట్లతో దూసుకుపోతున్నడు అక్షయ్. సూపర్ సక్సెస్ రేట్‌తో బాలీవుడ్ ఖాన్ త్రయం.. సల్మాన్, షారూక్, అమిర్ లను వెనక్కునెట్టిన ఈ ఖిలాడీ నంబర్ వన్‌ హీరోగా మారిపోయాడు. తన నటనతోనే కాకుండా మంచి మనసుతో అభిమానుల హృదాయాలు గెలుచుకోవడంలోనూ అతను ముందుంటాడు. నరనరానా దేశ భక్తి నింపుకున్న అక్షయ్‌ సైనికుల సంక్షేమం కోసం భారీగా ఖర్చు చేశాడు. అలాగే, పేదలు, అన్నార్తుల ఆకలి తీర్చడంలోనూ అతని పెద్ద చేయి. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు… ప్రధాని సహాయ నిధికి రూ.25 కోట్లు భారీ మొత్తం విరాళం ఇచ్చాడు. ‘భారత్‌ వీర్ సంస్థ’ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు.

    అక్షయ్‌ సంపాదన కూడా అదే స్థాయిలో ఉంది. ఎంతలా అంటే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్జించే ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో భారత్‌ నుంచి అతనికి మాత్రమే చోటు దక్కేలా. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది మే వరకు అక్షయ్ ఏకంగా రూ. 366 కోట్లు సంపాదించి బాలీవుడ్‌లో నంబర్ వన్‌ స్థానం సాధించాడు. వరల్డ్‌ లిస్ట్‌లో అతనికి 52వ స్థానం లభించింది. గతేడాది ఈ లిస్ట్‌లో 33వ స్థానంలో నిలిచిన అతను ఈ సారి 19 ర్యాంక్‌లో కోల్పోయాడు. గతేడాది అక్షయ్‌ రూ. 490 కోట్లు ఆర్జించాడు. అయితే, కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్స్‌, సినిమాలు నిలిచిపోవడంతో అతని సంపాదన తగ్గింది. అయినా టాప్ 100లో అతను చోటు దక్కించుకున్నాడు. దీనికి కారణం అమెజాన్‌ ప్రైమ్ ద్వారా అతను ఓటీటీ ఫ్లాట్ఫామ్‌లోకి రావడమే. ఓ డిజిటల్‌ సిరీస్‌ కోసం అక్షయ్‌ 75 కోట్లతో అమెజాన్‌తో డీల్‌ కుదుర్చుకున్నాడు. ఈ జాబితాలో కాస్మెటిక్‌ వరల్డ్‌ క్వీన్‌ కైలీ జెన్నర్ రూ. 4453 కోట్లతో అగ్రస్థానం సాధించింది.