బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో ఈ మధ్య మల్టీస్టారర్ మూవీల హవా నడుస్తోంది. కథ నచ్చితే స్టార్డమ్ పక్కనపెట్టి స్టార్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సౌత్ సీనియర్ హీరో విక్రమ్ మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు. తన కొడుకుతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఫలితాలు ఎలా ఉన్నా ప్రతి సినిమాలో, పాత్రలో వైవిధ్యం ఉండేలా ఆరాటపడే నటుడు విక్రమ్. తన గత చిత్రాలు చూస్తే చాలు అతను ఎంత కష్టపడతాడో చెప్పొచ్చు.
తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్న విక్రమ్.. ప్రస్తుతం అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ‘కోబ్రా’, మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. రజనీ కాంత్ ‘పేట’తో ఫేమస్ అయిన కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో మరో సినిమాకు కూడా విక్రమ్ ఓకే చెప్పాడు. ఇది విక్రమ్ కి 60వ చిత్రం. దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో తన కొడుకు ధృవ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో ధృవ్ నటిస్తాడని సమాచారం. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌తో ధృవ్ కోలీవుడ్‌లో ఇప్పటికే గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అతను మరో సినిమా కూడా చేస్తున్నాడు. దాంతో, తండ్రికొడుకులు కలిసి నటించాలని ఎప్పటి నుంచో ఆత్రుతగా ఉన్నారట. మంచి కథ కోసం విక్రమ్ వేచిచూస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు అతని ముందుకొచ్చాడు. కథ నచ్చడంతో ధృవ్‌తో మల్టీస్టారర్కు విక్రమ్ సరే అనేశాడని టాక్. అయితే, సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.