Kannappa: కన్నప్ప కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్… వీడియో వైరల్! ఇది పెద్ద స్కెచ్చే!

మంచు విష్ణు తెలివిగా పలు పరిశ్రమలకు చెందిన నటులను భాగం చేశాడు. దాంతో ఈజీగా ప్రచారం పొందవచ్చని ఆలోచన చేశాడు. కన్నప్ప మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్...

Written By: S Reddy, Updated On : April 16, 2024 2:04 pm

Akshay Kumar in Kannappa

Follow us on

Kannappa: మోహన్ బాబు వారసుడు మంచు విష్ణు హిట్ అన్న మాట విని ఏళ్ళు గడిచిపోతుంది. వరుస ప్లాప్స్ తో అంతో ఇంతో ఉన్న మార్కెట్ కూడా పోయింది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కనీసం పది కోట్ల మార్కెట్ లేని మంచు విషు ఏకంగా పాన్ ఇండియా సాహసం చేస్తున్నాడు. కన్నప్ప టైటిల్ తో భారీ భక్తిరస చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మంచు విష్ణునే నిర్మాత. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. భక్త కన్నప్ప కథ ఆధారంగా కన్నప్ప చిత్రం తెరకెక్కుతుంది.

మంచు విష్ణు తెలివిగా పలు పరిశ్రమలకు చెందిన నటులను భాగం చేశాడు. దాంతో ఈజీగా ప్రచారం పొందవచ్చని ఆలోచన చేశాడు. కన్నప్ప మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్ ఒక పాత్ర చేస్తున్నారు. ప్రభాస్ కన్నప్ప మూవీలో శివుడు పాత్ర చేస్తున్నాడని ప్రచారం జరిగింది.

Akshay Kumar Confirms Telugu Debut With Kannappa

కాదు ఆయనది నందీశ్వరుడు పాత్ర అని తాజాగా తెలిసొచ్చింది. మరి శివుడు పాత్ర చేస్తుంది ఎవరనగా… బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. ఏకంగా అక్షయ్ కుమార్ ని కూడా రంగంలోకి దింపారు. ఓ మై గాడ్ 2 చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడు పాత్ర చేశాడు. ఆయన మరోసారి శివుడిగా ప్రేక్షకులను అలరించనున్నాడు. అక్షయ్ కుమార్ ని తీసుకోవడం ద్వారా బాలీవుడ్ మార్కెట్ కూడా కొల్లగొట్టాలని మంచు విష్ణు భావిస్తున్నారు. నేడు అక్షయ కుమార్ కన్నప్ప మూవీ టీమ్ ని కలిశారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.

కన్నప్ప చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్. శివరాజ్ కుమార్.. ఇలా పలువురు స్టార్స్ నటిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్ పాత్రలపై క్లారిటీ వచ్చేసింది. మరి మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ చేసే పాత్రలు ఏమిటో తెలియాల్సి ఉంది. మెజారిటీ షూటింగ్ విదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. మంచు విష్ణు చేస్తున్న ఈ సాహసం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చేసిన భక్త కన్నప్ప అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసింది.