https://oktelugu.com/

Bullet Proof Vehicle: బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనాలంటే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలా? ఎందుకు?

బుల్లెట్ ప్రూఫ్ వాహనం కోరుకునేవాళ్లు ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి. జిల్లా అధికారితో పాటు హోం మంత్రిత్వ శాఖ నుంచి పర్మిషన్ లెటర్ పొందాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : April 16, 2024 / 02:04 PM IST

    Bulletproof car

    Follow us on

    Bullet Proof Vehicle: దేశంలో ప్రముఖ వ్యక్తులు, సెలబ్రెటీలు, ధనవంతుల్లో కొందరికి నేరస్తులతో ఎప్పటికీ ముప్పు ఉంటుంది. దీంతో వారు నిరంతరం అప్రమత్తగా ఉంటారు.. ఇంట్లో ఉన్నంత వరకు ఓకే.. కానీ బయట ప్రయాణించేటప్పుడు అత్యంత భద్రతతో కలిగి ఉండాలి. ఈ సమయంలో వారు ప్రయాణించే వాహనాలు, ఉండే ప్రదేశాల్లో రక్షణ వలయాలు ఏర్పాటు చేసుకుంటారు. ముఖ్యంగా ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించాలంటే దుండగులతో ముప్పు ఉనన వారు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. కొన్ని బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎటువంటి బాంబు దాడినైనా తట్టుకోగలవు.వాహనాల్లో ఉండేవారి రక్షణే ధ్యేయంగా ఇవి తయారు చేయబడుతాయి. అయితే బుల్లెట్ ప్రూప్ వాహనం కావాలంటే ఎలాంటి అనుమతులు తీసుకోవాలో తెలుసా?

    ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన కలకలం రేపింది. సల్మాన్ ఖాన్ కు ఇలాంటి సంఘటన ఎదురు కావడం కొత్తేమీ కాదు. ఈ నేపథ్యంలో ఆయన ముందు నుంచే బుల్లెట్ ప్రూఫ్ కారు వాడుతుంటారు. సల్మాన్ ఖాన్ మాత్రమే కాకుండా కొందరు సెలబ్రెటీలు, పేరున్న వ్యక్తులు ముందు జాగ్రత్తగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుగోలు చేస్తుంటారు. సాధారణంగా కారు కొనాలంటే షోరూం వెళ్లి తీసుకోవచ్చు. కానీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కొనుగోలు చేయాలంటే మాత్రం ప్రత్యేకంగా తయారు చేయించుకోవాలి. ఇందు కోసం ఏం చేయాలో తెలుసా?

    బుల్లెట్ ప్రూఫ్ వాహనం కోరుకునేవాళ్లు ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలి. జిల్లా అధికారితో పాటు హోం మంత్రిత్వ శాఖ నుంచి పర్మిషన్ లెటర్ పొందాలి. ఈ వాహనం పేలుళ్ల ప్రభావాన్ని తట్టుకునేలా అద్దాలు అమరుస్తారు. బాడీ కూడా స్టీల్ తో కూడుకొని ఉంటుంది. ఈ మధ్య వచ్చే సన్ రూఫ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. సాధారణ ఇంజిన్ కంటే ఇందులో ప్రత్యేకమైన ఇంజిన్ కలిగి ఉంటుంది. దీంతో ఈ వాహనం బరువు 300 నుంచి 700కిలోలు అదనంగా బరువు ను కలిగి ఉంటుంది.

    బుల్లెట్ ప్రూప్ వాహనాలను రూ. 20 నుంచి రూ.50 లక్షల వరకు విక్రయిస్తారు. దేశంలో ప్రతీ ఏడాది 20 నుంచి 25 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఇటీవల ప్రతీ సంవత్సరం 100 మంది తమకు బుల్లెట్ ప్రూఫ్ కావాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. బుల్లెట్ ప్రూప్ వాహనాలను ఎక్కువగా మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి స్కార్పియో, టాటా సఫారీ, టయోటా ఇన్నోవా, పోర్బ్ అవండర్, టయోటా పార్య్చునర్, బీఎం డబ్ల్యూ, ఆడి వంటి కార్లు బుల్లెట్ ప్రూఫ్ గా వచ్చాయి.