నటీనటులు: నందితా శ్వేత, సంజయ్ స్వరూప్, శకలక శంకర్, సత్య, మధునందన్, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, శ్రీతేజ్, శత్రు తదితరులు
కథ, దర్శకత్వం: బీ చిన్నికృష్ణ
నిర్మాత: అల్లూరి సురేశ్ వర్మ
మ్యూజిక్: సురేశ్ బొబ్బిలి
సినిమాటోగ్రఫి: నగేష్ బానెల్
ఎడిటింగ్: జీ సత్య
బ్యానర్: సినిమా హాల్ ఎంటర్‌టైన్‌మెంట్
రిలీజ్ డేట్: 2021-02-26
Also Read: ‘చెక్’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా
కథ..
తల్లిదండ్రులు లేని అక్షర(నందిత శ్వేత) విశాఖలోని విద్యా విధాన్ కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటుంది. పిల్లల్లో భయాన్ని పోగొడుతూ మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అదే కాలేజీ డైరెక్టర్ శ్రీతేజ్ (శ్రీతేజ్) అక్షరతో ప్రేమలో పడుతాడు. తన ప్రేమను చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే శ్రీతేజ్ హత్యకు గురవుతాడు. ఆ తర్వాత విచారణకు వచ్చిన పోలీస్ అధికారి కూడా హత్య చేయబడతాడు. వీరిద్దరినీ చంపింది తానే అంటూ లొంగిపోతుంది అక్షర! వీరిని నిజంగా చంపింది ఎవరు? ఆ హత్యలు చేయాల్సిన అవసరం ఎవరికి? ఎందుకు వచ్చింది? అసలు అక్షర గత జీవితం ఏంటి? అన్నది మిగతా కథ.
విశ్లేషణ..
ఇవాళ విద్యావ్యవస్థ ఎలా తయారైందో అందరికీ తెలిసిందే. పిల్లల్లో సృజనాత్మకతను పెంచే చదువులు కాకుండా.. కేవలం మార్కల కోసం బట్టీపట్టిస్తూ.. వారిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే విధానమే ఎక్కువగా కొనసాగుతోంది. ఇలాంటి మంచి పాయింట్ ను తీసుకున్నాడు దర్శకుడు. కార్పొరేట్ కాలేజీలు తీరుపై సంధించిన విమర్శనాస్త్రమే ‘అక్షర’. అయితే.. ఎంచుకున్న కథ మంచిదే అయినప్పటికీ.. దాన్ని నడిపించిన విధానమే తేడా కొట్టేసింది. వ్యవస్థలోని ఓ ప్రధానమైన సమస్యను ఎత్తుకున్న దర్శకుడు.. చివరకు దాన్ని ఓ మహిళ ప్రతీకార కథగా మార్చేసినట్టుగా కనిపిస్తుంది. ప్రధాన అంశాన్ని పక్కన పెట్టి.. కమర్షియల్ హంగుల కోసం తాపత్రయపడడంతో భావోద్వేగమైన కథ కాస్తా.. తేలిపోయినట్టు అనిపిస్తుంది.
తొలి భాగం మొత్తం రొటీన్ కామెడీతో సాగిపోతుంది. అసలు కథ మొదలవ్వడానికి చాలా సమయం పడుతుంది. షకలక శంకర్, మధునందన్, సత్య, అజయ్ ఘోష్ కామెడీతో లాగించేసి ద్వితీయార్థంలో అసలు కథను పట్టాలెక్కించాలనుకున్నాడు దర్శకుడు. దానికి అనుగుణంగానే.. తొలి భాగంలో ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లబోతున్నట్టుగా చూపించాడు. కానీ.. ఆ తర్వాత కూడా రొటీన్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఆసక్తి సన్నగిల్లేలా చేస్తుంది. సినిమాలో చివరి అరగంటలో హర్షవర్ధన్ ఎపిసోడ్, అక్షర ఫ్లాష్ బ్యాక్ కాస్త ఎమోషనల్ గా అనిపించినప్పటికీ.. కథనంలో చాలా లోపాలు కనిపిస్తాయి. విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపడానికి మధ్య మధ్యలో ప్రసంగాలతో చెప్పించినప్పటికీ.. దాన్ని కథలో భాగం చేయకపోవడంతో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోతారు.
Also Read: సూపర్ స్టార్ మహేష్ ప్లానింగ్.. మామూలుగా లేదుగా..!
యాక్టింగ్..
లేడీ ఓరియంటెడ్ గా సాగిన ‘అక్షర’ మూవీలో నందిత శ్వేత సినిమా ప్రధాన బలం. వన్ ఉమెన్ ఆర్మీగా సినిమా మొత్తాన్ని తానే నడిపించింది. ద్వితీయార్థంలో ఆమె నటన బాగా ఆకట్టుకుంది. ఇక సంజయ్ స్వరూప్ విలన్ గా చక్కగా నటించారు. హర్షవర్ధన్ నటన కూడా బాగుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు.
బలాలుః నందిత శ్వేత నటన, ఇంటర్వెల్ బ్యాంగ్, కొన్ని సన్నివేశాలు
బలహీనతలుః కథనం, ఫస్టాఫ్, రొటీన్ కామెడీ,
రేటింగ్: 2.25/5
లాస్ట్ లైన్ః ‘అక్షర’కు యావరేజ్ మార్కులే!
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్