https://oktelugu.com/

‘అర్జున్ రెడ్డి’ నటితో బంధం పై విశాల్ క్లారిటీ !

లాక్ డౌన్ నుండి సినిమా హీరోలు పెళ్ళితో తమ బ్యాచరల్ లైఫ్ కి శుభం కార్డ్ వేస్తున్నారు. అయితే, రెండేళ్ల క్రితం హైదరాబాద్ కి చెందిన అనిషా రెడ్డి అనే నటితో (అర్జున్ రెడ్డి ఫేమ్) హీరో విశాల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇక పెళ్లి ముహుర్తాలు ఫిక్స్ అయ్యే టైంలో ఏమైందో ఏమో గానీ విశాల్, అనిషాకి బ్రేకప్ చెప్పేశాడు. ఆ తరువాత మళ్ళీ ఆర్నెళ్ల తర్వాత ఇద్దరూ కలిసారని, లాక్ డౌన్ ముగిసిన వెంటనే […]

Written By:
  • Rocky
  • , Updated On : February 26, 2021 / 02:37 PM IST
    Follow us on


    లాక్ డౌన్ నుండి సినిమా హీరోలు పెళ్ళితో తమ బ్యాచరల్ లైఫ్ కి శుభం కార్డ్ వేస్తున్నారు. అయితే, రెండేళ్ల క్రితం హైదరాబాద్ కి చెందిన అనిషా రెడ్డి అనే నటితో (అర్జున్ రెడ్డి ఫేమ్) హీరో విశాల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇక పెళ్లి ముహుర్తాలు ఫిక్స్ అయ్యే టైంలో ఏమైందో ఏమో గానీ విశాల్, అనిషాకి బ్రేకప్ చెప్పేశాడు. ఆ తరువాత మళ్ళీ ఆర్నెళ్ల తర్వాత ఇద్దరూ కలిసారని, లాక్ డౌన్ ముగిసిన వెంటనే పెళ్లి ఉంటుంది అంటూ విశాల్ పీఆర్వోలు మీడియాకి చెప్పుకొచ్చారు. కాకపోతే మళ్ళీ విశాల్ పెళ్ళి మాట ఎత్తలేదు. మరోపక్క అనిషాతో బంధం గురించి ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు.

    Also Read: ‘చెక్’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా

    కానీ, తన ‘చక్ర’ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం ప్రస్తుతం తాను సింగిల్ అని, ఎవరితో ఎలాంటి రిలేషన్ లో లేనని స్పష్టం చేశాడు. త్వరలోనే “ఏదైనా శుభవార్త ఉంటుందా అంటే.. ఏమో జరగొచ్చు అని మాత్రం చెప్పగలను’ అంటూ తన పెళ్లి గురించి ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. కానీ, అనిషా రెడ్డి గురించి గాని, ఆమెతో తన పెళ్లి గురించి గాని ఒక్క మాట కూడా మాట్లాడకపోయే సరికి ఇక వీరి బంధానికి ఎండింగ్ కార్డు పడినట్లే అని తమిళ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

    Also Read: సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ ప్లానింగ్.. మామూలుగా లేదుగా..!

    కాగా విశాల్ కి ప్రస్తుతం 43 ఏళ్ళు, అయినా పెళ్లి చేసుకునే మూడ్ లో లేడు అనుకోండి. తెలుగులో కూడా హీరోగా బాగానే మార్కెట్ సంపాదించిన ఈ హీరో, తమిళనాడు నటుల సంఘానికి చెందిన రాజకీయాల్లో ఇరుక్కొని ఎక్కువ ఇబందుల పాలవుతూ.. అక్కడ మార్కెట్ పై ఈ మధ్య కాస్త పట్టు కోల్పోయినట్లు కనిపిస్తోంది. అయితే ఇటీవల విడుదలైన ‘చక్ర’ తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ, తమిళనాడులో మాత్రం భారీ కలెక్షన్లు సాధిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్