విగ్గు తీసి విసిరి కొట్టి.. ఏమనుకుంటున్నారు అక్కినేని అంటే ?

అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాలు తగ్గిస్తున్న కాలం అది. పెరిగిన వయసు రీత్యా ఆయన గొప్ప కథ ఉంటే తప్పితే, సినిమాలు చేయడం లేదు. ‘దాంపత్యం’ అనే మంచి కథతో రచయిత సత్యమూర్తి నాగేశ్వరరావు గారి దగ్గరకు వెళ్ళాడు. ఆ రోజుల్లో ఒక రచయిత కథ చెప్పడానికి వస్తే.. ఎంత పెద్ద స్టార్ అయినా ఎంతో గౌరవంగా చూసేవారు. పైగా సత్యమూర్తి కథ చెప్పడానికి మద్రాసు నుండి హైదరాబాద్‌ వచ్చారు. కథ చెప్పడం పూర్తి అయింది. కథలో […]

Written By: admin, Updated On : May 5, 2021 12:22 pm
Follow us on

అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాలు తగ్గిస్తున్న కాలం అది. పెరిగిన వయసు రీత్యా ఆయన గొప్ప కథ ఉంటే తప్పితే, సినిమాలు చేయడం లేదు. ‘దాంపత్యం’ అనే మంచి కథతో రచయిత సత్యమూర్తి నాగేశ్వరరావు గారి దగ్గరకు వెళ్ళాడు. ఆ రోజుల్లో ఒక రచయిత కథ చెప్పడానికి వస్తే.. ఎంత పెద్ద స్టార్ అయినా ఎంతో గౌరవంగా చూసేవారు. పైగా సత్యమూర్తి కథ చెప్పడానికి మద్రాసు నుండి హైదరాబాద్‌ వచ్చారు.

కథ చెప్పడం పూర్తి అయింది. కథలో కొన్ని చోట్ల బూతు ఉందేమో అని అక్కినేనికి అనిపించింది. ‘కథ నాకు ఓకే.. డైరెక్టర్‌ గారికి కూడా ఓకేనా’ అని అడిగారు నాగేశ్వరరావుగారు. ‘బాగా నచ్చిందండి’ అన్నాడు రచయిత. అంతే, చదలవాడ బ్రదర్స్‌ తిరుపతిరావు, శ్రీనివాసరావు నిర్మణంలో అట్టహాసంగా సినిమా మొదలైపోయింది. జయసుధ, సుహాసిని హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు. అయితే హైదరాబాద్‌ లో మాత్రమే నాగేశ్వరరావుగారు షూటింగ్స్‌ జరపాలని పట్టుబట్టేవారు.

కానీ అప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం మద్రాసులో ఉండేది. ‘దాంపత్యం’ షూటింగ్‌ హైదరాబాద్‌ లోనే ప్లాన్‌ చేయాల్సి వచ్చింది దర్శకనిర్మాతలకు. కానీ సినిమా ఓపెనింగ్‌ కోసం కూడా హైదరాబాద్‌ కు వెళ్లడం ఇష్టం లేని దర్శకుడు కోదండరామిరెడ్డి, అక్కినేనికి ఫోన్ చేసి ‘సర్‌, వేరే సినిమాల షూటింగ్స్‌ తో కాస్త బిజీగా ఉన్నాను. మీరు ఏమి అనుకోకపోతే సినిమా ఓపెనింగ్‌ మద్రాసులో పెట్టుకుందాం. మీరు మద్రాసు రావాలి సర్‌’ అని మర్యాదగానే అడిగాడు.

కాకపోతే మద్రాసులో తెలుగు సినిమా షూటింగ్‌ చేయడం, అలాగే ఓపెనింగ్ చేయడం కూడా నాగేశ్వరరావుగారికి అసలు ఇష్టం ఉండేది కాదు. అందుకే నాగేశ్వరరావు గారు ‘మద్రాసులో షూటే కాదు ఓపెనింగ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు’ అని తేల్చి చెప్పారు. అల ఆ సినిమా ఓపెనింగ్ లోనే అభిప్రాయభేదాలు వచ్చాయి. ఆ తరువాత దర్శకుడు కోదండరామిరెడ్డి ‘ఔట్‌ డోర్‌ లో షూట్ ప్లాన్ చేశారు. ముందుగా పాటతో షూటింగ్‌ ప్రారంభించారు. అయితే, అప్పుడే ఆ పాటను చూసిన అక్కినేని మొహంలో ఒక్కసారిగా కోపం ఎక్కువవుతుంది. ఆ పాట చరణంలో ఓ ద్వంద్వార్ధ పదంతో చిన్న బూతు ఉంది.

సడెన్ గా అక్కినేని కుర్చీలోంచి ఒక్కసారిగా సీరియస్ అవుతూ పైకి లేచి.. ఆవేశంతో ఊగిపోతూ..‘నేను హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. పైగా నా పై తీసే పాటలో బూతులు పెడతారా? ఏమనుకుంటున్నారు అక్కినేని అంటే ? జూనియర్‌ ఆర్టిస్ట్‌ అనుకున్నారా ? అంటూ ‘నేను ఈ చిత్రం చేయడం లేదు’ అని యూనిట్ లో అందరూ వినేలా గట్టిగా అరిచి, తల పై తన విగ్గు తీసి నేల పై విసిరి కొట్టి అక్కడ నుండి కోపంగా వెళ్లిపోయారు. అయితే, తరువాత అక్కినేని ఆ సినిమా చేశారు, సినిమా కూడా బాగానే ఆడింది లేండి.