
కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎప్పటి నుంచో ఉన్న తాగునీటి సమస్య టాలీవుడ్ హీరో అడవి శేష్ తీర్చాడు. కొన్ని రోజుల క్రితం అడవి శేష్ 865 లీటర్ల ప్యాకేజీ తాగునీటిని హైదరాబాద్ లోని కోటి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ప్రస్తుతం 300 మందికి పైగా కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న ఈ ఆసుపత్రిలో కొన్నేళ్లుగా తాగు నీటి సమస్యతో అక్కడికి వస్తున్న రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటకు 1000 లీటర్ల తాగునీటిని శుద్ధి చేయగల ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించినందుకు అడవి శేష్ ను పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.