విద్యుదాఘాతం వల్ల చెలరేగిన మంటలతో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమైన ఘటన నగరంలోని ఉప్పల్ లో ఈ ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ కు చెందిన షహజాబ్ (38) కంటైనర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన గంగా సాగర్ (50) లోకల్ గైడ్ గా ఉపాధి పొందుతున్నాడు. శంషాబాద్ నుంచి ఉప్పల్ ఐడీఏకు వీరిద్దరు కార్ల కంటైనర్ తో బయల్దేరారు. మాడ్రన్ బెడ్ ప్రాంతానికి రాగానే ప్రమాదవశాత్తు వీరి వాహనం కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ తీగలు కంటైనర్ పై పడి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.