Nagarjuna Comments On Rashmika: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కుబేర'(Kubera Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి వీకెండ్ కాసుల కనకవర్షం కురిపించింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 60 శాతానికి పైగా రికవరీ ని సాధించింది. మొదటి వారం పూర్తి అయ్యేలోపు కచ్చితంగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అయితే తెలుగు వెర్షన్ లో వస్తున్నంత వసూళ్లు ఎందుకో తమిళ వెర్షన్ లో రావడం లేదు. ధనుష్ చిత్రాలు సాధారణంగా తమిళం లో కేవలం మూడు రోజుల్లోనే 30 నుండి 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతూ ఉంటాయి. కానీ ఎందుకో ఈ సినిమాకు మూడు రోజులకు కలిపి 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. కనీసం లాంగ్ రన్ లో అయినా స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటుందో లేదో చూడాలి.
Also Read: మెగాస్టార్ చిరంజీవి కాళ్ళు మొక్కిన ధనుష్..కానీ నాగార్జున ని కనీసం పట్టించుకోలేదుగా!
ఇదంతా పక్కన పెడితే నిన్న హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ని ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో అక్కినేని నాగార్జున చాలా కాలం తర్వాత ఎంతో ఉల్లాసంగా మాట్లాడాడు. ముఖ్యంగా హీరోయిన్ రష్మిక గురించి ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘రష్మిక నిన్ను చూస్తే నాకు క్షణక్షణం చిత్రంలో శ్రీదేవి గారు గుర్తొచ్చారు అమ్మా. నిజంగా చాలా ఫ్రేమ్స్ లో అద్భుతంగా అనిపించావు. నేషనల్ క్రష్ అని ఎప్పటి నుండి వచ్చింది నీకు ఇది?..పుష్ప నుండి వచ్చిందా?..ఇప్పుడు నేషనల్ క్రష్ మాత్రమే కాదు, నా క్రష్ కూడా. సినిమా చూసిన తర్వాత నీ ఫ్యాన్ ని అయిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
హీరో ధనుష్ గురించి మాట్లాడుతూ ‘ధనుష్..నీ నటన గురించి నేనేమి చెప్పగలను. నాలుగు నేషనల్ అవార్డ్స్ ఇప్పటికే ఉన్నాయి. ఎంత అద్భుతమైన నటుడివి అంటే నీ గురించి ఏది చెప్పినా తక్కువే అవుతుంది. చిరంజీవి గారు మీకో విషయం చెప్పాలి. సెట్స్ లో నేను ఒక్కోసారి ధనుష్ కి గుర్తు పట్టలేకపోయేవాడిని. ఇది ధనుష్ నా? లేకపోతే క్యారక్టరా? అని అయోమయానికి గురి అయ్యేవాడిని. సినిమాలో మీరు గమనిస్తే ధనుష్ కుడి చెయ్యి ప్రారంభం నుండి చివరి వరకు ఒకేలా ఉంటుంది. సాధారణంగా మనం సూట్ వేసినప్పుడు కానీ, డ్యాన్స్ వేసినప్పుడు కానీ మనకి తెలియకుండానే చెయ్యి బయ్యకి వచ్చేస్తుంది. కానీ ఇతను ఏది చేసిన తన కుడి చెయ్యిని అలాగే ఉంచేవాడు. నిజంగా చాలా అద్భుతం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరి గురించి నాగార్జున ఎంతో గొప్పగా మాట్లాడాడు.