India Vs England 1st Test Day 3 Highlights: బుమ్రా మినహా మిగతా వారంతా తేలిపోయారు. దారుణంగా పరుగులు ఇచ్చారు. ఆడుతోంది టెస్ట్ అని మర్చిపోయి టి20 తరహాలో పరుగులు సమర్పించుకున్నారు. అసలే నాసిరకమైన బౌలింగ్ అనుకుంటే.. ఫీల్డింగ్ మరింత దారుణంగా ఉంది.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు క్యాచులు జారవిడిచారు. ఇందులో జైస్వాల్ జార విడిచినవే మూడు క్యాచ్లు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: రష్మిక నేషనల్ క్రష్ మాత్రమే కాదు..నాకు కూడా క్రష్ నే – అక్కినేని నాగార్జున
వాస్తవానికి లీడ్స్ మైదానంలో భారత్ ఏకంగా 471 పరుగులు చేసింది. అంతరి భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. బ్రూక్ ఒక పరుగు తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ.. ఇంగ్లాండ్ టెయిలెండర్లు దుమ్మురేపారు.. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు 465 పరుగులు చేసింది.. పోప్ సెంచరీ తో చెలరేగాడు. స్మిత్ 40 పరుగులు చేశాడు. వోక్స్ 38 పరుగులతో ఆకట్టుకున్నాడు.. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ప్రసిద్ 3, తి రాజు రెండు వికెట్లు సాధించాడు. భారత ఫీల్డర్లు ఏకంగా ఐదు క్యాచ్లను వదిలేసారు. బుమ్రా బౌలింగ్ లోనే నాలుగు క్యాచులు జారవించడం విశేషం. జైస్వాల్ అయితే మూడు క్యాచ్ లను వదిలేసాడు. ఈ మైదానంలో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ.. గాలివీస్తూ పేస్ బౌలర్లకు సహకరించినప్పటికీ.. బంతిని స్వింగ్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. భారత ఫీల్డర్లు కూడా క్యాచ్లను అందుకోవడంలో విఫలమయ్యారు. బ్రూక్ క్యాచ్ ను పంత్ పట్టుకోలేకపోవడం మ్యాచ్ స్వరూపాన్ని ఒక్కసారిగా మార్చేసింది. దీనికి తోడు సిరాజ్, ప్రసిద్ అత్యంత చెత్తగా బౌలింగ్ వేశారు. వీరి నిర్లక్ష్యం వల్ల ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏకంగా 23.4 ఓవర్లలో 138 పరుగులు చేశారు. జడేజా పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయలేకపోయాడు.. బుమ్రా మాత్రం ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు..
ఇక భారత్ రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత.. సెంచరీ హీరో జైస్వాల్ నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో సాయి సుదర్శన్ 30 పరుగులు చేసి స్థిరంగా కనిపిస్తున్న సమయంలో స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం కెప్టెన్ గిల్ , కేఎల్ రాహుల్ క్రీజ్ లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 96 పరుగుల లీడ్ లో ఉంది. లీడ్స్ లో దుమ్ము రేపాలంటే భారత ప్లేయర్లు నాలుగో రోజు అదరగొట్టాలి. ముఖ్యంగా దూకుడుగా ఆడాలి. ఇంగ్లాండ్ బౌలర్లను బెదరగొట్టాలి. లేనిపక్షంలో తొలి టెస్ట్ డ్రా గా ముగిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పిచ్ మీద ఇంగ్లాండ్ బౌలర్లు పేస్ రాబడుతున్నారు. ఖచ్చితమైన వేగంతో బంతులు వేస్తున్నారు. ముఖ్యంగా స్టోక్స్, టంగ్ అదరగొడుతున్నారు.. వీరిద్దరు కూడా హాఫ్ సైడ్ బంతులు వేస్తూ భారత బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికైతే రాహుల్ స్థిరంగా ఆడుతున్న నేపథ్యంలో.. నాలుగో రోజు అతడు ఏ స్థాయిలో పరుగులు చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. గిల్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన నేపథ్యంలో.. అతడి మీద కూడా భారత జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. వీరిద్దరు గనుక మెరుగైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తే టీమిండియా ఇంగ్లాండ్ ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశాలున్నాయి.
Also Read: మెగాస్టార్ చిరంజీవి కాళ్ళు మొక్కిన ధనుష్..కానీ నాగార్జున ని కనీసం పట్టించుకోలేదుగా