హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ రీమేక్‌లో కాజల్‌!

ఇండియాలో ఈ మధ్య వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. రెగ్యులర్ సినిమాలను తలదన్నే రీతిలో పలు భాషల్లో సిరీస్‌లు వస్తున్నాయి. బాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది స్టార్లు వెబ్‌కు జై కొట్టారు. సైఫ్ అలీఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీ డిజిటల్‌ స్పేస్‌లో సక్సెస్‌ సాధించారు. అమెజాన్‌లో ఓ ఊపు ఊపిన ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తో మనోజ్‌ బాజ్‌పాయ్‌ అయితే విపరీతమైన క్రేజ్‌ సంపాదించాడు. కియారా ఆడ్వాణీ, రిచా చద్దా వంటి హీరోయిన్లు వెబ్‌ సిరీస్‌లతోనే […]

Written By: Neelambaram, Updated On : July 23, 2020 10:19 pm
Follow us on


ఇండియాలో ఈ మధ్య వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. రెగ్యులర్ సినిమాలను తలదన్నే రీతిలో పలు భాషల్లో సిరీస్‌లు వస్తున్నాయి. బాలీవుడ్‌లో ఇప్పటికే చాలా మంది స్టార్లు వెబ్‌కు జై కొట్టారు. సైఫ్ అలీఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, నవాజుద్దీన్‌ సిద్దిఖీ డిజిటల్‌ స్పేస్‌లో సక్సెస్‌ సాధించారు. అమెజాన్‌లో ఓ ఊపు ఊపిన ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తో మనోజ్‌ బాజ్‌పాయ్‌ అయితే విపరీతమైన క్రేజ్‌ సంపాదించాడు. కియారా ఆడ్వాణీ, రిచా చద్దా వంటి హీరోయిన్లు వెబ్‌ సిరీస్‌లతోనే దర్శకుల దృష్టిలో పడ్డారు. బాలీవుడ్‌ బాటలోనే రీసెంట్‌గా సౌత్‌ స్టార్లు కూడా వెబ్‌ బాట పడుతున్నారు. సౌత్‌ స్టార్ హీరోయిన్‌ సమంత అక్కినేని.. ఫ్యామిలీ మ్యాన్‌ సెకండ్‌ పార్ట్‌లో నటించింది. అందులో ఆమె ఏకంగా టెర్రిరస్ట్‌ పాత్ర చేసినట్టు సమాచారం. దిగ్గజ దర్శకుడు మణిరత్నం ప్లాన్‌ చేసిన ‘నవరస’ అనే వెబ్‌ సిరీస్‌లో సూర్య, అరవింద్‌ స్వామి, సిద్దార్థ్‌ వంటి స్టార్లు నటించబోతున్నారు.

Also Read: బాలీవుడా అండర్ వరల్డా?

ఇప్పుడు స్టార్ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ కూడా డిజిటల్‌ రంగంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిందట. ఇప్పటికే వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ‘లైవ్‌ టెలీకాస్ట్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో కాజల్‌ నటిస్తోందని సమాచారం. ఇప్పుడు మరో పాపులర్ వెబ్‌ షోలో నటించేందుకు ఆమె పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. అది ఓ హాలీవుడ్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌కు రీమేక్‌ అని సమాచారం. ఆ సిరీస్‌ మరేదో కాదు. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌లో అడుగు పెట్టిన ప్రియాంక చోప్రా చేసిన సిరీస్‌. ఆమె కీలక పాత్ర పోషించిన ‘క్వాంటికో’ అనే ఇంగ్లిష్‌ సిరీస్‌ మంచి సక్సెస్‌ సాధించింది. దాన్ని హిందీలో రీమేక్‌ చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మేకర్స్‌ కాజల్‌ అగర్వాల్‌ను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ప్రొడ్యూస్‌ చేస్తుందని సమాచారం.