Akkineni Nagarjuna
Akkineni Nagarjuna : అప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరని అందం తో టాలీవుడ్ కి మోస్ట్ రొమాంటిక్ హీరో గా పేరు తెచ్చుకున్న నటుడు అక్కినేని నాగార్జున. ఆయన సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వస్తే ఎలాంటి వారైనా అదృష్టంగా భావిస్తుంటారు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ నాగార్జున(Akkineni Nagarjuna) సరసన హీరోయిన్ అవకాశం వచ్చిందంటే అసలు వదులుకోరు. ముఖ్యంగా ఆయనతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే ఛాన్స్ ఇస్తే ఉచితంగా సినిమాలు చేసే హీరోయిన్స్ కూడా ఉంటారు. అంతటి క్రేజ్ ఉన్న హీరో ఆయన. 65 ఏళ్లకు పైగా వయస్సు ఉంటుంది నాగార్జునకి. కానీ చూసేందుకు ఆయన నాగ చైతన్య(Akkineni Nagarjuna), అఖిల్(Akkineni Akhil) లకు సోదరుడిలాగా అనిపిస్తాడు. ఈ వయస్సు లో ఈ రేంజ్ ఫిజిక్ ని మైంటైన్ చేయడమంటే మాటలు కాదు. అందుకే ఎవర్ గ్రీన్ మన్మథుడు టైటిల్ కి అర్హుడు అయ్యాడు. అలాంటి నాగార్జున తో కలిసి నటించేందుకు ఒక హీరోయిన్ అనేక కండిషన్స్ పెట్టిందట.
Also Read : నాగార్జున అసలు పేరేంటో తెలుసా? ఏఎన్నార్ ముద్దుగా పెట్టుకుంటే అలా మార్చుకున్నాడా?
ఆ హీరోయిన్ మరెవరో కాదు, జ్యోతిక. అప్పట్లో నాగార్జున, జ్యోతిక(Heroine Jyothika) కాంబినేషన్ లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పట్లో ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు ఈ సినిమా నాగార్జున కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. అయితే ఈ సినిమాలో మొదట్లో నటించడానికి జ్యోతిక ఒప్పుకోలేదట. ఎందుకంటే ఆమె అప్పుడప్పుడే హీరో సూర్య తో పెళ్ళికి సిద్ధం అవుతూ ఉంది. ఇక సినిమాలను మెల్లగా తగ్గించాలి అనే ఆలోచనలో ఉన్నింది అట. ఆ సమయంలోనే లారెన్స్ ఆమె వద్దకు వచ్చి ‘మాస్’ స్టోరీ ని వినిపించాడట. నాకు ఇప్పట్లో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదు, నేను చేయలేను అని చెప్పిందట. కానీ లారెన్స్ ఈ పాత్రని కేవలం మీ కోసం మాత్రమే డిజైన్ చేసానని, మీరు తప్ప ఇందులో ఎవరు సూట్ కారని, దయచేసి చేయండి అని బ్రతిమిలాడడంతో కొన్ని షరత్తుల మీద ఈ సినిమా చేయడానికి ఆమె ఒప్పుకుందట.
ఎటువంటి పరిస్థితిలో కూడా నేను అందాల ఆరబోత చేయను, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం నాకు ఇష్టం లేదు. కేవలం సినిమా షూటింగ్ సంబంధించి మాత్రమే డేట్స్ ఇస్తాను, ప్రొమోషన్స్ కి ఇవ్వలేను, వీటి అన్నిటికి ఓకే అయితే చెప్పు డేట్స్ ఇస్తాను అనిందట. రాఘవ లారెన్స్ అందుకు ఒప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత ఏమి జరిగిందో మనమంతా చూసాము. నాగార్జున కి జోడిగా అప్పట్లో సౌందర్య, సిమ్రాన్ వంటి వారు అద్భుతంగా సూట్ అయ్యారు. వీళ్ళతో నాగార్జున కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద అదిరిపోయింది. వాళ్ళతో సమానంగా జ్యోతిక కూడా నాగార్జున కి జోడిగా అద్భుతంగా సూట్ అయ్యింది. ఆన్ స్క్రీన్ మీద వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ని చూసి నిజమైన ప్రేమికులు అనే ఫీలింగ్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత జ్యోతిక మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించలేదు.
Also Read : ‘పుష్ప’ కథ పెద్ద గొప్పదేమీ కాదు..కేవలం ఆ కారణంగానే హిట్ అయ్యింది అంటూ అక్కినేని నాగార్జున షాకింగ్ కామెంట్స్!