https://oktelugu.com/

Akkineni Nagarjuna: ‘పుష్ప’ కథ పెద్ద గొప్పదేమీ కాదు..కేవలం ఆ కారణంగానే హిట్ అయ్యింది అంటూ అక్కినేని నాగార్జున షాకింగ్ కామెంట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన పుష్ప(Pushpa Movie) మేనియా నుండి మన ఇండియన్ సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులు ఇంకా తేరుకోలేదు. సుకుమార్ అనే డైరెక్టర్ మాస్ లోకి దిగితే, మా లాంటోళ్ళు సర్దుకొని ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవడమే అని రాజమౌళి ఒకప్పుడు ఊరికే అనలేదు, ఇప్పుడు పుష్ప మేనియా చూస్తుంటే అప్పట్లో రాజమౌళి(SS Rajamouli) సుకుమార్(Sukumar) ని ఎంత చదివాడో అర్థం అవుతుంది.

Written By: , Updated On : February 16, 2025 / 07:30 AM IST
Follow us on

Akkineni Nagarjuna: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన పుష్ప(Pushpa Movie) మేనియా నుండి మన ఇండియన్ సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులు ఇంకా తేరుకోలేదు. సుకుమార్ అనే డైరెక్టర్ మాస్ లోకి దిగితే, మా లాంటోళ్ళు సర్దుకొని ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవడమే అని రాజమౌళి ఒకప్పుడు ఊరికే అనలేదు, ఇప్పుడు పుష్ప మేనియా చూస్తుంటే అప్పట్లో రాజమౌళి(SS Rajamouli) సుకుమార్(Sukumar) ని ఎంత చదివాడో అర్థం అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పుష్ప రాజ్ క్యారక్టర్ కి ఆడియన్స్ అడిక్ట్ అయిపోయారు. మళ్ళీ ఇలాంటి క్యారక్టర్ అల్లు అర్జున్ కి పడుతుందో లేదో తెలియదు కానీ, పుష్ప ఫ్రాంచైజ్ ని మాత్రం కొనసాగించాల్సిందే అని ట్రేడ్ లో పెద్ద డిమాండ్ ఉంది. మరి అల్లు అర్జున్, సుకుమార్ కొనసాగిస్తారో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మాట్లాడిన పలు ఆసక్తికరమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘పుష్ప చిత్రం నేడు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఆ సినిమా కథ కాదు, పుష్ప రాజ్ అనే క్యారక్టర్. ఆ క్యారక్టర్ ఇప్పటి తరం యూత్ కి ఒక సూపర్ హీరో క్యారక్టర్ గా మారిపోయింది. సోషల్ మీడియా లో ఆ పాత్రకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. మీమ్స్, స్పూఫ్స్ వంటివి దేశవ్యాప్తంగా ఈ క్యారక్టర్ పై లక్షల్లో వచ్చాయి. ఒక ట్రెండ్ ని సెట్ చేసిన క్యారక్టర్ గా నిలిచిపోయింది. అందుకే ఆ చిత్రం అంతటి సంచలన విజయం సాధించింది. ఇక్కడ కథ ప్రాముఖ్యత అసలు లేదు. ఒక పాత్రకు దక్కిన అద్భుతమైన ఆదరణ అది’ అంటూ నాగార్జున ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ 50 వ వార్షికోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

అందుకేనేమో అల్లు అర్జున్ కూడా ఇక నుండి తన ఫోకస్ మొత్తం క్యారక్టర్ ఓరియెంటెడ్ సినిమాలపైనే ద్రుష్టి పెట్టాడు. ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా కూడా అదే. ఇందులో అల్లు అర్జున్ సుబ్రమణ్య స్వామిగా కనిపించనున్నాడు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి జీవించే తత్త్వం ఉన్న అల్లు అర్జున్, ఈ సినిమాని ఏ రేంజ్ కి తీసుకెళ్తాడో చూడాలి. అసలే ఇప్పుడు దేశవ్యాప్తంగా మైథాలజీ కి సంబంధించిన సినిమాలకు కాసుల కనకవర్షం కురుస్తున్నాయి. అల్లు అర్జున్ నార్త్ ఇండియన్ మాస్ మర్కెట్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే పుష్ప 2 కి రెండింతలు ఎక్కువ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఈ సబ్జెక్టు కి అంత రేంజ్ ఉందా లేదా అనేది. ఉగాది నుండి ఈ సినిమాని సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.