https://oktelugu.com/

Akkineni Nagarjuna :  నాగార్జున అసలు పేరేంటో తెలుసా? ఏఎన్నార్ ముద్దుగా పెట్టుకుంటే అలా మార్చుకున్నాడా?

చాలా మంది నటుల అసలు పేర్లు వేరు. స్క్రీన్ నేమ్ క్యాచీగా ఉండేలా పెట్టుకుంటారు. అలాగే కింగ్ నాగార్జున కూడా తన పేరు మార్చుకున్నాడట. ఈ విషయం చాలా మందికి తెలియదు. కొడుకు నాగార్జునకు అక్కినేని నాగేశ్వరరావు పెట్టుకున్న పేరేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Written By: , Updated On : February 23, 2025 / 11:40 AM IST
Akkineni Nagarjuna

Akkineni Nagarjuna

Follow us on

Akkineni Nagarjuna :  ఏఎన్నార్ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున స్టార్ హీరో అయ్యారు. నటనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. విభిన్నమైన చిత్రాలు, విలక్షణ పాత్రలు చేశారు. టాలీవుడ్ మన్మధుడిగా పేరుగాంచిన నాగార్జునకు ఇతర భాషల్లో కూడా ఇమేజ్ ఉంది. దశాబ్దాల క్రితమే హిందీలో చిత్రాలు చేశారు. హీరోగా రాణిస్తూనే ఆయన తండ్రి నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోని సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారు. నిర్మాతగా పదుల సంఖ్యలో చిత్రాలు, సీరియల్స్ చేశారు.

నాగార్జునకు తెలిసినంతగా డబ్బులు సంపాదించడం మరొక తెలుగు హీరోకి తెలియదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. ఇదిలా ఉండగా నాగార్జునకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త తాజాగా తెరపైకి వచ్చింది. నాగార్జున అసలు పేరు వేరట. ఏఎన్నార్ చిన్న కుమారుడైన నాగార్జునకు సాగర్ అని పేరు పెట్టాడట. అక్కినేని నాగార్జున సాగర్ పూర్తి పేరు అట. అయితే నాగార్జున తన పేరు నుండి సాగర్ తీసేశారట. సింపుల్ గా నాగార్జున అని మార్చుకున్నారట. ఈ వార్తలో నిజమెంతో కానీ వైరల్ అవుతుంది. ఇక చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ కాగా, మోహన్ బాబు పేరు భక్తవత్సల నాయుడు.

ఈ మధ్య కాలంలో ఆయన విజయాలపరంగా వెనుకబడ్డారు. సోలో హీరోగా భారీ సక్సెస్ కొట్టి చాలా కాలం అవుతుంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా అనంతరం నాగార్జున చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఆయన గత చిత్రం నా సామిరంగా ఓ మోస్తరు విజయం అందుకుంది. ఈ మూవీలో అల్లరి నరేష్ మరో ప్రధాన పాత్ర చేశాడు.

నాగార్జున తోటి హీరోలు వెంకీ, బాలకృష్ణ, చిరంజీవి భారీ విజయాలు అందుకుంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వెంకటేష్ ఏకంగా రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టి… బాలయ్య, చిరంజీవిలను కూడా దాటేశాడు. నాగార్జున ప్రస్తుతం కూలీ, కుబేర చిత్రాలు చేస్తున్నారు. కూలీలో రజినీకాంత్, కుబేర లో ధనుష్ హీరోలుగా నటిస్తున్నారు. నాగార్జున కీలక రోల్స్ చేస్తున్నారు. కుబేర చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకుడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ తెరకెక్కుతుంది.

కూలీ మూవీలో నాగార్జున పాత్ర పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. అలాగే కుబేర మూవీలో ప్రోమోలు ఆకట్టుకున్నాయి. కూలీ, కుబేర చిత్రాలతో నాగార్జున ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.