Naga Chaitanya: హీరో నాగ చైతన్య చేసిన పనికి నెటిజెన్స్ భేష్ అంటున్నారు. ఓ స్టార్ హీరో ఇంత సింపుల్ గా ఉండటం గ్రేట్ అంటున్నారు. విషయంలోకి వెళితే నాగ చైతన్య వద్ద పని చేస్తున్న ఓ కుర్రాడు నచ్చిన బైక్ కొనుక్కున్నాడు. ఆ విషయం నాగ చైతన్యకు చెప్పాడు. ఆ కుర్రాడు తన బైక్ పై నాగ చైతన్య ఆటోగ్రాఫ్ చేయాలని అడిగాడు. అతని కోరికను మన్నించిన నాగ చైతన్య బైక్ మీద ఆటోగ్రాఫ్ చేశాడు. అలాగే మొదటి బైక్ ఎక్కి మొదటి రైడ్ చేశాడు.
తన స్టాఫ్ మెంబర్ తో కలిసి ఫోటో దిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగ చైతన్య ఫ్యాన్స్ మావాడు గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య సింప్లిసిటీని పలువురు కొనియాడుతున్నారు. నాగ చైతన్యకు బైక్, కార్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద ఖరీదైన కార్లు, హై ఎండ్ బైక్స్ ఉన్నాయి. మరోవైపు నాగ చైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాడు.
గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగ చైతన్య ఓ చిత్రం చేస్తున్నారు. ఇది చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. గతంలో నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలు చేశాడు. వారి కాంబోలో మూడో చిత్రం ఇది. ఇక చందూ మొండేటి గత చిత్రం కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది.
ఇక సాయి పల్లవి-నాగ చైతన్యలది హిట్ కాంబినేషన్. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ చిత్రంలో కలిసి నటించారు. మరోవైపు నాగ చైతన్య పరాజయాల్లో ఉన్నారు. ఆయన గత చిత్రాలు థాంక్యూ, కస్టడీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో చందూ మొండేటి చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక సాయి పల్లవికి కూడా తెలుగులో గ్యాప్ వచ్చింది.
Pure soul !❤️✨ #NagaChaitanya pic.twitter.com/NU6LK4ui3e
— Anchor_Karthik (@Karthikk_7) October 2, 2023