Samantha , Shobhita Dhulipalla
Samantha and Shobhita Dhulipalla : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగేశ్వరరావు(Nageshwara ra) నుంచి నాగార్జున(Nagarjuna), నాగచైతన్య (Naga chaithanya) వరకు మూడు తరాలకు సంభందించిన హీరోలు సినిమా ఇండస్ట్రీ మీద తమ మార్క్ ను చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా నాగార్జున లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వైవిద్య భరితమైన పాత్రలను పోషించడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. భక్తి రస పాత్రల్లో అయిన కమర్షియల్ సినిమాల్లో అయిన,రొమాంటిక్ సినిమాల్లో అయినా ఏ సినిమాలైనా చేయగలిగే సత్తా ఉన్నా నటుడు నాగార్జున అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న స్టార్ హీరోలందరు ఉన్నప్పటికి నాగార్జున, నాగచైతన్య మాత్రం డిఫరెంట్ వే లో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇదిలా ఉంటే రీసెంట్ గా నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల(Shobitha Dulipalla)ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీన చాలా తక్కువ మంది అతిధులతో అన్నపూర్ణ స్టూడియోలో వీళ్ళ పెళ్లి జరిగింది. ఇక ఇదిలా ఉంటే శోభిత నాగచైతన్య దంపతులు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు.
మరి వీళ్ళిద్దరూ వేరే కాపురం పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటికే శోభిత కి చాలా ఎక్కువ సంఖ్యలో సినిమా ఆఫర్లు అయితే వస్తున్నాయట. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్లు వస్తూ ఉండటంతో ఆమె తమ మఖం ను ముంబై కి మార్చాలని అనుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా నాగచైతన్య లాంటి నటుడు ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలను చేస్తూ స్టార్ హీరో రేంజ్ కి వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలో తన ముంబైకి తమ మకాం ను మారుస్తే ఇక్కడ సినిమాలు షూటింగ్ లకి ఇబ్బందిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ తన అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఇంతకుముందు సమంత ఎలాగైతే పెళ్లి తర్వాత సినిమాలను చేసిందో ఇప్పుడు శోభిత కూడా అలాగే సినిమాలో నటించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక వీళ్ళు వేరే కాపురం పెట్టాలనుకునే దానికి సంబంధించి అలాగే శోభిత సినిమాల్లో నటిస్తుందా లేదా అనే దానికి సంబంధించిన విషయాలు తెలియాలంటే నాగచైతన్య, శోభిత ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప దీని మీద సరైన క్లారిటీ అయితే రాదు…