https://oktelugu.com/

Rajamouli and Mahesh Babu : ‘SSMB 29’ సెట్ లోకి అడుగుపెట్టాలంటే మహేష్ తో సహా అందరు రాజమౌళి పెట్టిన ఈ కండిషన్స్ ను ఫాలో అవ్వాల్సిందేనా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : January 28, 2025 / 10:31 AM IST
    Rajamouli , Mahesh Babu

    Rajamouli , Mahesh Babu

    Follow us on

    Rajamouli and Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక దర్శక ధీరుడు రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసిన కూడా ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు అయిన రాజమౌళి (Rajamouli) తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమా లతో 12 విజయాలను అందుకొని ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్టుతో మరోసారి తను పాన్ వరల్డ్ లో సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో రాజమౌళి పూర్తిగా సక్సెస్ అయ్యాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఏమాత్రం పాన్ ఇండియా మార్కెట్ లేని మహేష్ బాబు ను హీరోగా ఎంచుకొని పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు అంటే ఆయన కాన్ఫిడెంట్ ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం రాజమౌళి పేరు చూసే ఈ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక రాజమౌళి సినిమా అంటే హీరోలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కాబట్టి మహేష్ బాబు కూడా రాజమౌళి పెట్టే రిస్త్రీక్షన్స్ ని పూర్తిగా ఫాలో అయిపోతూ రాజమౌళికి పూర్తిగా సరెండర్ అయినట్లుగా తెలుస్తోంది.

    ఎందుకంటే రాజమౌళి సినిమా నుంచి ఒక లీక్ ని కూడా బయటికి రాకుండా చూసుకుంటాడు. అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా రాజమౌళి తీవ్ర స్థాయిలో ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి రాజమౌళి ఏది చెబితే అది హీరోలు గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉండాల్సిందే…ఇక అదే రీతిలో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ చివర్లలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

    అయితే సినిమా సెట్ లోకి ఎవరూ కూడా ఫోన్ తో ఎంటర్ అవ్వద్దని రాజమౌళి కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తోంది… ఇక మహేష్ బాబు కూడా సెట్ కి వచ్చాడు అంటే తన ఫోన్ పక్కన పెట్టి లోపలికి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సినిమాలో నటించే ప్రతి ఆర్టిస్టు గాని, టెక్నీషియన్ తో సహా సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర సెట్ లోపలికి ఎంటర్ అయ్యే ముందే సెల్ ఫోన్స్ తీసుకొని పక్కన పెట్టేసి లోపలికి పంపిస్తున్నారట…

    ఇక దానికోసం రాజమౌళి అందరి దగ్గర నుంచి ‘నాన్ డిస్ క్లోజ్ అగ్రిమెంట్’ (NDA) చేసుకున్నట్లుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతూ ముందుకైతే సాగుతున్నాడు. మరి ఎట్టకేలకు ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధించి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి కూడా తెలుగు సినిమా సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…