Akkineni Akhil: అక్కినేని ఫామిలీ మూడవ తరం నటులలో భారీ హైప్ తో వచ్చిన హీరో అక్కినేని అఖిల్..మనం సినిమాలో చిన్న గెస్ట్ రోల్ లో తళుక్కుమని మెరిసిన అఖిల్ ని చూసి ప్రతి ఒకరు కూడా తొలి సినిమాతోనే స్టార్ హీరో అయిపోతాడు అని అనుకున్నారు..తొలి సినిమా అఖిల్ కూడా భారీ అంచనాల నడుమ విడుదలైంది..కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ ఓపెనింగ్స్ మాత్రం అదరగొట్టేసింది..ఇక ఆ సినిమా తర్వాత కూడా అఖిల్ నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాలు సాధించలేదు..ఇక గత ఏడాది విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా పర్వాలేదు అనే విధంగానే ఆడింది కానీ , అఖిల్ కెరీర్ కి ఈ సినిమా ఏ మాత్రం ఉపయోగపడలేదు అనే చెప్పాలి..ప్రస్తుతం అక్కినేని అభిమానులందరూ ఎంతో ఆత్రుత తో ఎదురు చూస్తున్న చిత్రం ఏజెంట్..ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు..స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు దర్శక నిర్మాతలు..ఈ సినిమా అక్కినేని అఖిల్ కెరీర్ కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత అఖిల్ వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో ఒక సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది..ఈ సినిమాని దిల్ రాజు తన బ్యానర్ లో నిర్మించబోతున్నాడు..అయితే ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం ‘తమ్ముడు’ సినిమా టైటిల్ ని పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.
Also Read: Acharya Effect: ఇంతకుముందు ఏ సినిమా ప్లాప్ కాలేదా ? ఒక్క ఆచార్యకే ఎందుకు ఇలా ?

ఇటీవల కాలం లో కుర్ర హీరోలందరూ పవన్ కళ్యాణ్ సినిమా పేర్ల మీద పడిన సంగతి మన అందరికి తెలిసిందే..మొన్నీమధ్యనే విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాకి పవన్ కళ్యాణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచినా ఖుషి సినిమా టైటిల్ ని పెట్టుకున్నాడు..ఈ చిత్రం లో సమంత హీరోయిన్ గా నటిస్తుంది..ఇలా వరుసగా కుర్ర హీరోలందరూ..పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్స్ పై పడడం తో ఆయన అభిమానులు సోషల్ మీడియా లో ఫైర్ అవుతున్నారు..అయితే పవన్ కళ్యాణ్ కి వకీల్ సాబ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వేణు శ్రీరామ్ , ఇప్పుడు తన కొత్త సినిమాకి పవన్ కళ్యాణ్ టైటిల్ వాడుకుంటున్నాడు కచ్చితంగా వాళ్ళ సపోర్ట్ కూడా భవిష్యత్తులో వేణు శ్రీరామ్ ఇచ్చే వివరణ బట్టి ఉంటుంది అనొచ్చు.
Also Read:The Warrior: షాకింగ్.. వారియర్ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended Videos




[…] […]