Mahesh- Trivikram: త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేస్తున్న పాన్ ఇండియా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 12వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ 96 రోజుల పాటు తన డేట్లు ఇచ్చాడు. అయితే, ఈ సినిమా బడ్జెట్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. పాన్ ఇండియా బడ్జెట్ పెట్టి సినిమా చేస్తే.. హిందీలో ఎంతవరకు మార్కెట్ అవుతుందో తెలియదు.
Mahesh- Trivikram
ఇటు మహేష్ కి గానీ, అటు త్రివిక్రమ్ కు గానీ హిందీలో మార్కెట్ లేదు. పైగా హిందీ జనాలకు వీరిద్దరూ పరిచయం కూడా లేదు. కాబట్టి.. బడ్జెట్ ను ఓవర్ గా పెట్టకపోవడమే మంచిది అనేది నిర్మాతల అభిప్రాయం. మరోపక్క త్రివిక్రమ్ మాత్రం పాన్ ఇండియా సినిమాకి పాన్ ఇండియా బడ్జెట్ లేకపోతే వర్కౌట్ కాదు, కాబట్టి కచ్చితంగా బడ్జెట్ ఉండాల్సిందే అంటూ ప్రస్తుతం కిందామీదా పడుతున్నాడు.
Also Read: Akkineni Akhil: పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో అక్కినేని అఖిల్ కొత్త సినిమా
వచ్చే వారం నుంచి ఈ సినిమా పై నిర్మాతలతో కలిసి మహేష్, త్రివిక్రమ్ కూడా కూర్చో బోతున్నారు. మొదట స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ పై కూర్చుని, ఆ తర్వాత బడ్జెట్ పై తుది నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికి త్రివిక్రమ్ భారీ బడ్జెట్ లేనిది సినిమా చేయలేడు కాబట్టి.. పాన్ ఇండియా బడ్జెట్ ను కచ్చితంగా పెట్టిస్తాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సంగీత చర్చలు కూడా మొదలయ్యాయి.
ఇప్పటికే, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ కొన్ని ట్యూన్స్ ను కూడా ఫైనల్ చేశారు. తన ప్రతి సినిమాలో ఓ ప్రత్యేక సాంగ్ డిజైన్ చేస్తుంటాడు త్రివిక్రమ్. అలాగే ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ ను పెట్టాడు. ఈ సాంగ్ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వస్తోందట. ఈ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ కనిపించనుంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ విషయానికి వస్తే.. రాజకీయ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని మలచాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.
Mahesh- Trivikram
త్రివిక్రమ్ ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా హైలైట్ చేయబోతున్నాడు. మెయిన్ గా ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యంలో జరిగే ఎమోషనల్ డ్రామాగా, అలాగే ప్లాష్ బ్యాక్ లో పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక రాజకీయ పాత్రను రాశాడు. సంజయ్ ది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read:Acharya Effect: ఇంతకుముందు ఏ సినిమా ప్లాప్ కాలేదా ? ఒక్క ఆచార్యకే ఎందుకు ఇలా ?