Bhartha Mahasayulaku Wignyapthi: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.కారణం వల్ల సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయి. ఇక మీడియం రేంజ్ హీరోలను ఎవరు పట్టించుకోరు. టైర్ వన్ హీరోలకు దక్కిన క్రేజ్ మీడియం రేంజ్ హీరోలకు లభించడం లేదు. స్టార్ హీరోల సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ మీడియం హీరోలకు రావడం లేదు… ఏది ఏమైనా కూడా రవితేజ లాంటి నటుడు సోలోగా ఇండస్ట్రీకి వచ్చి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించాడు. అలాగే తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు… ఇక ఈరోజు తను ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు…ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
రవితేజ యాక్టింగ్ వెన్నెల కిషోర్, సునీల్, సత్యల కామెడీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా మారాయి… అలాగే మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది… ఇంటర్వెల్ కి ముందు వచ్చే కొన్ని సన్నివేశాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి…
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే విషయంలో కూడా దర్శకుడు చాలా వరకు మిస్టేక్స్ చేశాడు. కొన్ని సన్నివేశాలను డైరెక్షన్ చేయడంలో తడబడ్డాడు… క్లైమాక్స్ కంక్లూషన్ సరిగ్గా ఇవ్వలేకపోయాడు. వీటన్నింటి వల్ల ఈ సినిమాకి భారీ దెబ్బ పడింది… ఇక మొత్తానికైతే రవితేజ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడు అని అనుకున్న వాళ్ళందరికి నిరాశే మిగిలింది.
ఈ సినిమా యావరేజ్ టాక్ ను మూట గట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా కమర్షియల్ సినిమాలను నమ్ముకొని, మాస్ ఫార్ములతో ముందుకు సాగుతున్న రవితేజ ఒక్కసారిగా ఫ్యామిలీ సినిమాలను నమ్ముకోవడం ఆ సినిమాలు సైతం నిరాశను మిగిల్చడంతో తన అభిమానులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు… ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతుంది. రోజులు గడిచే కొద్ది టాక్ ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది…