10-Minute Delivery Banned: ఆన్‌లైన్ సర్వీస్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఈకామర్స్ సంస్థలపైనే చాలా వరకు ఆధారపడుతున్నారు. దీంతో ఈకామర్స్ సంస్థలు కూడా కస్టమర్లకు మెరుగైన సేవలు అందిచేందుకు ఫోటీపడుతున్నాయి. ఈ క్రమంలో జెప్టో, బ్లింకిట్ వంటి సంస్థలు పది నిమిషాల్లో డెలివరీ సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఈ విధానంతో ఆయా సంస్థలో పనిచేసే గిగ్ వర్కర్లు ఇబ్బంది పడుతున్నారు. గిగ్ వర్కర్ల నిరసనల నేపథ్యంలో కేంద్రం క్విక్ కామర్స్ సంస్థలపై కొత్త ఆంక్షలు విధించింది. కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ 10 నిమిషాల డెలివరీలను రద్దు చేయాలని ఆదేశించారు. బ్లింకిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లు యాడ్‌లలో ఈ టైమ్‌లైన్ చూపకూడదని స్పష్టం చేశారు.
గిగ్ వర్కర్ల నిరసనలు
కొత్త సంవత్సరానికి ముందు డెలివరీ బాయ్స్‌లు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక వేగ లక్ష్యాలు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని డిమాండ్ చేశారు. ఈ ఒత్తిడి కేంద్ర జోక్యం చేసుకుంది. 10 నిమిషాల మోడల్ రద్దు సంస్థల వ్యాపార వ్యూహాలను మార్చనుంది. డెలివరీ సమయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కానీ వర్కర్ల భద్రత మెరుగుపడుతుంది.
క్విట్ సర్వీస్‌ల రద్దు ప్రభావం..
ఈ మార్పు ఇ–కామర్స్ రంగాన్ని ప్రభావితం చేస్తుంది. గ్రాహకులు సౌలభ్యం కోల్పోవచ్చు, సంస్థలు కొత్త మార్గాలు ఆవిష్కరించాలి. గిగ్ ఎకానమీలో కార్మిక హక్కులు బలపడుతాయి.డెలివరీ వేగాలకు భద్రతా మార్గదర్శకాలు రూపొందించాలి. వర్కర్లకు బీమా, శిక్షణ కార్యక్రమాలు అమలు చేయాలి. సంస్థలు బాధ్యతాయుత వ్యాపార మోడల్‌లకు మారాలి.
మొత్తంగా గిగ్ వర్కర్లకు తాజా నిర్ణయం ఊరట దక్కింది. క్విక్ కామర్స్ సమస్థలు కూడా ఈమేరకు ప్రకటన చేశాయి. పది నిమిషాల డెలివరీని ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటించాయి.