Akkineni Akhil New Movie Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా నాగేశ్వరరావు, నాగార్జున దగ్గర తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేశారు. ప్రతి పాత్ర కి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో వాళ్లు చేసే సినిమాల విషయంలో చాలా క్లారిటీ గా ఉంటున్నారు. నాగార్జున తర్వాత నాగచైతన్య ఇండస్ట్రీకి వచ్చి రొమాంటిక్ హీరోగా మారాడు. ఆ తర్వాత మాస్ సినిమాలు చేసినప్పటికి అతనికి అంత పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం డిఫరెంట్ సినిమాల వైపు తన అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే నాగార్జున చిన్న కొడుకు అయిన అఖిల్ సైతం ఇప్పుడు ప్రత్యేకమైన పాత్రలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన ఇండస్ట్రీ కి వచ్చి 10 సంవత్సరాలు దాటినప్పటికి ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ ని కూడా సాధించలేకపోయాడు. దాంతో ఇప్పుడు ‘లెనిన్’ సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే తప్ప అఖిల్ ఇండస్ట్రీలో సర్వేవ్ అవ్వడం చాలా కష్టమనే చెప్పాలి.
Also Read: రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యకరం? తక్కువైనా.. ఎక్కువైనా.. ఎలాంటి సమస్యలు?
ఇక అఖిల్ కి వరుసగా ప్లాపులు వస్తున్న సందర్భంలో నాగార్జున స్టార్ డైరెక్టర్ ఆయన కొరటాల శివ దగ్గరికి వెళ్లి అతన్ని అఖిల్ తో ఒక సినిమా చేయమని అడిగారట. అప్పుడు నాగార్జున చాలా బిజీ కమిట్ మెంట్స్ తో ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాడు. ఫ్యూచర్ లో తప్పకుండా చేద్దామని చెప్పారట.
ఇక ఇప్పటికైనా కొరటాల శివ దేవర సినిమా తో యావరేజ్ టాక్ ను సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. కాబట్టి అఖిల్ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో కూడా నాగార్జున మరోసారి తన సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.
మొత్తానికైతే చిన్న చిన్న హీరోలందరు వచ్చి స్టార్ హీరోలుగా మారుతుంటే అఖిల్ మాత్రం ఇప్పటివరకు ఒక్క సక్సెస్ ని కూడా సాధించకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి…నిజంగానే కొరటాల తన తర్వాత సినిమాను అఖిల్ తో చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…