https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 ఎండింగ్ లో మరో ట్విస్ట్ ప్లాన్ చేసిన సుకుమార్…

'పుష్ప 2' సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి అల్లు అర్జున్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసమే అహర్నిశలు కష్టపడి ఈ సినిమాను చేశాడు. మరి ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : November 8, 2024 / 09:34 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రెస్టేజీయస్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2… ఈ సినిమా విషయంలో చాలామంది పలు రకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ మాత్రం ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ గా మలిచే విధంగా ముందుకు తీసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ విపరీతంగా కష్టపడ్డాడు. అలాగే సుకుమార్ కూడా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా రిలీజ్ కి ఇంకా నెలరోజుల సమయం కూడా లేదు కాబట్టి ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్స్ ను శరవేగంగా జరపడానికి సినిమా యూనిట్ భారీగా సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. పుష్ప మొదటి పార్ట్ లో తనదైన రీతిలో నటించి మెప్పించడమే కాకుండా నేషనల్ అవార్డుని గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి పుష్ప 2 సినిమా తర్వాత ఆయన ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడు. ఇంక ఎలాంటి అవార్డులను అందుకుంటాడు అనే విషయం మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

    ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగాలంటే సక్సెస్ లు మాత్రం సాధించాలి. ఇక మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చిన కూడా తొందరగా వాళ్ళని వాళ్ళు రికవరీ చేసుకోలేకపోతే మాత్రం ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్క హీరో అయిన సరే ఫేడౌట్ అయిపోవాల్సిన పరిస్థితి రావచ్చు.

    అందుకే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఆచితూచి మరి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సరిగ్గా తను ఎదిగే సమయంలో పుష్ప సినిమా రావడం అనేది నిజంగా అతనికి ఒక బూస్టప్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు…

    ఉంటే పుష్ప 2 క్లైమాక్స్ లో సుకుమార్ ఒక భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే పుష్ప 3 సినిమాకు సంబంధించిన లీడ్ ని పుష్ప 2 ఎండింగ్ లో ఇచ్చి పుష్ప 3 సినిమాని అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేదానిమీద సరైన క్లారిటీ లేదు. కానీ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…