Akira Nandan Latest Looks: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులంతా ఇప్పుడు అకిరా నందన్(Akira Nandan) టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో అభిమానులకు ఇప్పటి వరకు క్లారిటీ లేదు. రేణు దేశాయ్ ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాకు కూడా అకిరా నందన్ సినిమాల్లోకి రావాలని కోరిక ఉంది, కానీ వాడికి నటన కంటే మ్యూజిక్ మీదనే అత్యంత ఆసక్తి ఉందంటూ చెప్పుకొచ్చింది. కానీ విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే అకిరా నందన్ గత ఏడాది నుండి ఫిలిం స్కూల్ లో జాయిన్ అయ్యాడని, నటన నేర్చుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ కూడా ‘అన్న స్టాపబుల్’ షో లో అకిరా ఎంట్రీ త్వరలోనే ఉంటుందని ఖరారు చేసాడు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కచ్చితంగా అకిరా ఎంట్రీ టాలీవుడ్ లో ఉంటుంది అనే నమ్మకం ఏర్పడింది.
అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈమధ్య కాలం లో ఎక్కువగా అకిరా ని తనతో పాటు తిప్పుతూ ఆడియన్స్ కి గట్టిగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో సందర్భాల్లో ఇది మనం చూసాము. ఇప్పుడు లేటెస్ట్ గా ‘సర్గమ్ – ఇండియన్ నావెల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా’ కార్యక్రమం లో పవన్ కళ్యాణ్ తో కలిసి పాల్గొన్నాడు అకిరా నందన్. సన్నని మీసాలు, గెడ్డాలతో టీనేజ్ వయస్సు లో పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవాడో, అలాంటి లుక్స్ తో మిలమిల మెరిసిపోతూ కనిపించాడు. ఈ లుక్స్ ని చూసిన నెటిజెన్స్ సోషల్ మీడియా లో ఇవేమి లుక్స్ రా బాబు, ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే మొదటి సినిమాతోనే పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయిపోతాడు, ప్రభాస్ కి పోటీ అవుతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో రామ్ చరణ్ వెండితెర అరంగేట్రం కూడా ఇంతే హైప్ తో జరిగింది. మొదటి సినిమాతోనే ఆయన స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టాడు. అకిరా నందన్ అయితే ఏకంగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ లీగ్ లోకి మొదటి సినిమాతోనే అడుగుపెడుతాడని అంటున్నారు. సోషల్ మీడియా మొత్తాన్ని ఊపేస్తున్న అకిరా వీడియో ని మీరు కూడా చూసేయండి.
ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖలో డిప్యూటీ సీఎం @PawanKalyan గారు ✊ pic.twitter.com/j8o11sX5jt
— Team PoliticalSena (@Teampolsena) November 29, 2025