Film Industry: మద్రాస్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఓన్ ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసి హౌజ్ లను నిర్మించుకున్నారు. ఇక దాంతోపాటుగా సినిమాలను చేస్తూనే కొంతమంది స్టార్ హీరోలు స్టూడియోలను కూడా నిర్మించుకోవడానికి గవర్నమెంట్ రాయితీలు ఇవ్వడంతో మొత్తానికైతే ఇక్కడ స్టార్ హీరోలంతా సెటిల్ అయిపోయారు. ఇక ప్రస్తుతం వాళ్లు సినిమా కోసం వందల కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తేనే అదో వండర్ గా చెప్పుకునే వాళ్లం…ఇక అక్కడి నుంచి 100 కోట్ల మార్కును అందుకునే స్థాయికి వెళ్ళింది. ఇక ఇప్పుడు 1000, 2000 కోట్లను టార్గెట్ గా పెట్టుకొని సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు…ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరి దగ్గర ఉన్న ఆస్తుల విలువలను కలిపితే లక్ష కోట్లకి పైనే అవుతుందని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి సినిమాల ద్వారా హీరోలకు వచ్చేది చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఆ వచ్చిన డబ్బుని వాళ్ళు బిజినెస్ లో పెట్టుబడులు పెట్టడం అలాగే రియల్ ఎస్టేట్ మీద భారీగా పెట్టుబడును పెట్టి ఎక్కువ లాభాలను మూటగట్టుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే హైదరాబాదులో ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఒకప్పుడు ఇక్కడ ల్యాండ్స్ తీసుకున్న స్టార్ హీరోలు,డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ వందల కోట్లకు అధిపతులుగా మారారు.
ఒకరకంగా శోభన్ బాబు తనకు వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసేవాడట. దాంతో ఇప్పుడు ఆయన ఆస్తుల విలువ 80000 కోట్లు గా ఉందని అంచనా వేస్తున్నారు. ఇక శోభన్ బాబు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇండస్ట్రీకి రాకపోవడంతో ఆయన తరంతోనే సినిమా ఇండస్ట్రీకి వాళ్ళ ఫ్యామిలీ దూరమైపోయింది…
మొత్తానికైతే ఇప్పుడు కోకాపేట్ లో ఒకప్పుడు తక్కువ రేటుకి మన స్టార్ హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా ఎకరాల భూమిని కొనుగోలు చేసి పెట్టారు. ఇక ఇప్పుడు సిటీ డెవలప్ అవ్వడంతో ల్యాండ్స్ వాళ్ళు వందల కోట్లలో పెరిగిపోయింది. అక్కడ ల్యాండ్స్ అమ్మిన కూడా వాళ్లకు మంచి లాభాలైతే వస్తున్నాయి…
రీసెంట్ గా రాయదుర్గం దగ్గర ఏడెకరాల గవర్నమెంట్ ల్యాండ్ ను అమ్మితే 1350 కోట్లకు పైన అమౌంట్ వచ్చింది… కాబట్టి ఎటు చూసినా మన స్టార్ హీరో, డైరెక్టర్ల ఆస్తులు ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికైతే స్టార్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్ల ఆస్తులు మొత్తం కలిపితే లక్ష కోట్లుగా ఉంటుందని ప్రతి ఒక్కరు అంచనా వేస్తున్నారు…