Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి మరియు మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్’.తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.14 రీల్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.’వాల్తేరు వీరయ్య’ గ్రాండ్ సక్సెస్ అయ్యినప్పటికీ మెగా ఫ్యాన్స్ లో భోళా శంకర్ చిత్రం ఏమాత్రం ఆశలు లేవు.
ఎందుకంటే ఇది ఒక రీమేక్ చిత్రం అవ్వడం, అసలు దర్శకత్వం అంటే ఏంటో కూడా తెలియని మెహర్ రమేష్ లాంటి డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం తో ఫ్యాన్స్ ఎప్పుడో ఈ చిత్రం పై ఆశలు వదిలేసుకున్నారు. అయితే అభిమానుల్లో జోష్ నింపడానికి మెహర్ రమేష్ తనకి తోచింది ఎదో చేస్తున్నాడు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అట.
ఇటీవలే హైదరాబాద్ లోని నారాయణగూడ లో ఉన్నటువంటి శాంతి థియేటర్ లో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ కి సంబంధించిన కటౌట్ మరియు బ్యానర్స్ తో నింపేశారు. ఎందుకిలా చేస్తున్నారు అని ఆరాలు తియ్యగా అది భోళా శంకర్ మూవీ షూటింగ్ కోసం ఏర్పాటు చేసిందని. మెగాస్టార్ చిరంజీవి ఇందులో పవన్ కళ్యాణ్ అభిమాని గా నటిస్తున్న సందర్భంగా , ఆయనకీ సంబంధించి థియేటర్ లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తుంది. మెగాస్టార్ లాంటి లెజెండ్ పవన్ కళ్యాణ్ అభిమాని అంటే ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో అని విశ్లేషకులు భయపడుతున్నారు.
చిరంజీవి అడుగుజాడల్లో వచ్చి పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ హీరో అయ్యాడు , ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ 25 సినిమాల్లో నటిస్తే ఒక్క చిత్రం లో కూడా ఆయన చిరంజీవి అభిమానిగా నటించలేదు.అలాంటిది మెగాస్టార్ ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ తట్టుకోగలరా అనే సందేహం అందరిలో నెలకొంది.చూడాలి మరి వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో తెలియాలంటే ఆగష్టు 11 వరకు వేచి చూడాల్సిందే.