https://oktelugu.com/

Akhil Akkineni: ఏజెంట్ మూవీ రెస్పాన్స్ ని భరించలేక థియేటర్ నుండి అఖిల్ వాక్ అవుట్

అఖిల్ 'ఏజెంట్' సినిమాని హైదరాబాద్ లోని శ్రీ రాములు థియేటర్ లో అభిమానులతో కలిసి చూద్దామని వచ్చాడు,అభిమానులు అఖిల్ కి థియేటర్ లో ఘన స్వాగతం పలికారు, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయ్యేలా అరుపులు మరియు కేకలతో హోరెత్తించారు. అయితే ఫస్ట్ హాఫ్ కి అభిమానుల రియాక్షన్ చూసి మూవీ యూనిట్ బాగా నిరాశకి గురి అయ్యింది. అఖిల్ కూడా అసంతృప్తి చెందాడు.

Written By:
  • Vicky
  • , Updated On : April 28, 2023 / 04:24 PM IST
    Follow us on

    Akhil Akkineni: అక్కినేని అఖిల్ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రం గా తెరకెక్కిన సినిమా ‘ఏజెంట్’ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే. 14 రీల్స్ బ్యానర్ పై అనిల్ సుంకర తెరకెక్కించిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ సహా నిర్మాతగా వ్యవహరించాడు.సురేందర్ రెడ్డి అంటే సైలిష్ డైరెక్టర్, స్టోరీ ఎలా ఉన్నా ఆయన టేకింగ్ అద్భుతంగా ఉంటుంది, హీరో క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

    అదే ఈ ఏజెంట్ చిత్రం లో కూడా ఉంటుందని ఆశించారు ఫ్యాన్స్, కానీ ఈ చిత్రం కనీస స్థాయిలో కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో అభిమానులు తీవ్రమైన నిరాశకి గురయ్యారు.ఈ చిత్రాన్ని 37 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు బయ్యర్స్. ఇప్పుడు కనీసం పది కోట్ల రూపాయిల షేర్ ని అయినా వసూలు చేస్తుందో లేదో అని భయపడుతున్నారు.

    ఇది ఇలా ఉండగా ఈరోజు అఖిల్ ‘ఏజెంట్’ సినిమాని హైదరాబాద్ లోని శ్రీ రాములు థియేటర్ లో అభిమానులతో కలిసి చూద్దామని వచ్చాడు,అభిమానులు అఖిల్ కి థియేటర్ లో ఘన స్వాగతం పలికారు, థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయ్యేలా అరుపులు మరియు కేకలతో హోరెత్తించారు. అయితే ఫస్ట్ హాఫ్ కి అభిమానుల రియాక్షన్ చూసి మూవీ యూనిట్ బాగా నిరాశకి గురి అయ్యింది. అఖిల్ కూడా అసంతృప్తి చెందాడు.

    అభిమానులకు సినిమా ఏమాత్రం నచ్చలేదని గమనించి ఫస్ట్ హాఫ్ అయిపోయే లోపే థియేటర్ నుండి వెళ్ళిపోయాడు.తమ అభిమాన హీరో చివరి వరకు తమతో కూర్చొని సినిమా చూడలేకపోయాడే అని ఫ్యాన్స్ కూడా నిరాశకి గురయ్యారు.ఇలా అందరినీ ఈ చిత్రం నిరాశకి గురి చేసింది, అయితే సమీర్ సీజన్ కాబట్టి ఈ చిత్రం కనీసం 20 కోట్ల షేర్ ని ఫుల్ రన్ లో వసూలు చేస్తుందనే ఆశతో ఉన్నారు బయ్యర్స్.