Homeఎంటర్టైన్మెంట్Akhil Raj: డెలివరీ బాయ్ ని కొట్టడం పై క్లారిటీ ఇచ్చిన 'రాజు వెడ్స్ రంభాయ్'...

Akhil Raj: డెలివరీ బాయ్ ని కొట్టడం పై క్లారిటీ ఇచ్చిన ‘రాజు వెడ్స్ రంభాయ్’ హీరో అఖిల్ రాజ్.. వీడియో వైరల్..

Akhil Raj:  సోషల్ మీడియా లో నిన్నటి నుండి ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ‘రాజు వెడ్స్ రాంభాయ్’ మూవీ హీరో అఖిల్ రాజ్ తన ఇంటికి వచ్చిన ఒక డెలివరీ బాయ్ ని చితకబాదడంతో, ఆ డెలివరీ బాయ్ వీడియో ని రికార్డు చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. తప్పు ఆర్డర్ డెలివరీ చేసినందుకు అఖిల్ రాజ్ ఇలా కొట్టాడు అని , అతని తల్లి నా ముఖం పై ఊసిందని […]

Akhil Raj:  సోషల్ మీడియా లో నిన్నటి నుండి ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ‘రాజు వెడ్స్ రాంభాయ్’ మూవీ హీరో అఖిల్ రాజ్ తన ఇంటికి వచ్చిన ఒక డెలివరీ బాయ్ ని చితకబాదడంతో, ఆ డెలివరీ బాయ్ వీడియో ని రికార్డు చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. తప్పు ఆర్డర్ డెలివరీ చేసినందుకు అఖిల్ రాజ్ ఇలా కొట్టాడు అని , అతని తల్లి నా ముఖం పై ఊసిందని , ఇలా సోషల్ మీడియా లో అందరికీ అర్థం అయ్యేలా చేశారు ఆ డెలివరీ బాయ్. అయితే అసలు జరిగిన విషయాన్ని నేడు హీరో అఖిల్ రాజు వివరిస్తూ మరో వీడియో విడుదల చేశారు. ఇది విన్న తర్వాత అఖిల్ రాజ్ ఆ విధంగా రియాక్ట్ అవ్వడంతో అసలు తప్పు లేదని అంటున్నారు నెటిజెన్స్.

ఆయన మాట్లాడుతూ ‘మా ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి చెలం రెసిడెన్సీ లోని ఒక ఫ్లాట్ లో ఇవ్వాల్సిన పార్సిల్ ని , ఆ డెలివరీ బాయ్ అరుణా రెసిడెన్సీ లో ఉన్న మా ఫ్లాట్ లో ఇచ్చారు. మా ఇంట్లో ఎవరో ఒకరు ఆర్డర్ చేసి ఉంటారేమో అని మా నాన్న ఆ పార్సిల్ ని అందుకున్నారు. కానీ పార్సిల్ పై చెలం రెసిడెన్సీ అని స్పష్టంగా రాసుంది. ఈ విషయం తెలియక మా అమ్మ ఆ పార్సిల్ ని ఓపెన్ చేసి చూసింది. అందులోని ఐటమ్స్ మేము ఆర్డర్ చేయలేదని నిర్ధారణ అవ్వడం తో పక్కన పెట్టేసాం. 20 నిమిషాల తర్వాత ఆ డెలివరీ బాయ్ మా ఫ్లాట్ కి వచ్చి ఆ పార్సిల్ ని తిరిగి ఇవ్వాలని అడిగాడు. అందుకు నేను బ్రదర్ మీరు అసలు అడ్రస్ సరిగా చూసుకున్నారా అని అడిగితే, చూడలేదు , అలా ఇచ్చేశానంటే అని అన్నాడు’.

‘ఇంతలోపే మా అమ్మ అక్కడికి వచ్చి , బాబు తెలియక పార్సిల్ ఓపెన్ చేశాము , ఏమి అనుకోకండి అని తిరిగి ఇచ్చేంసింది. మద్యం మత్తులో ఉన్న ఆ డెలివరీ బాయ్ వెళ్తూ వెళ్తూ ఉచితంగా వస్తే , తీసేసుకుంటారా అని అన్నాడు. నేను మాటలు జాగ్రత్తగా రానివ్వు బ్రదర్ అన్నాను. మా అమ్మ ని ఎవరైనా ఒక్క మాట అంటే నాకు కోపం సహజంగానే వచ్చేస్తుంది. ఇంతలోపే అతను ఫోన్ కెమెరా తీసి , నువ్వు సినిమా హీరోవి కదా, ఉండు నీ పని చెప్తా అని ఫోన్ లో వీడియో రికార్డు చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమం లోనే మా మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. మా అమ్మ ని అన్నాడు కాబట్టే గొడవ పడ్డాను , లేకపోతే డెలివరీ బాయ్ తో గొడవ పడాల్సిన అవసరం నాకేంటి’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏమి మాట్లాడారో ఈ క్రింది వీడియోలో చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper