Akhil Lenin Movie Update: అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరో తమ సత్తా చాటుతూ భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు… నాగేశ్వరరావు దగ్గర నుంచి అఖిల్ వరకు ప్రతి హీరో ప్రేక్షకుల్లో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపించాలనే ప్రయత్నం చేసిన వారే కావడం విశేషం…నాగార్జున, నాగచైతన్య లాంటి హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే అఖిల్ మాత్రం ఒక్క సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. తను ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటినప్పటికి ఇప్పటివరకు తనకి ఒక సూపర్ సక్సెస్ కూడా లేదు. మరి అలాంటి అఖిల్ ఇప్పుడు లెనిన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా మాస్ హిట్ గా తనకు ఒక గొప్ప కెరియర్ ను ఇస్తుందనే ఉద్దేశ్యంతో అఖిల్ ఉన్నాడు.
అయితే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ, అన్నపూర్ణ స్టూడియోస్ మీద నాగార్జున, నాగ సుశీల లు కలిసి నిర్మిస్తూ ఉండడం విశేషం… అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జనవరి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది… ఎలాగైనా సరే ఈ సినిమా తనకి ఒక మాస్ హిట్ ఇస్తుందనే ఉద్దేశ్యంతో అఖిల్ ఈ సినిమా కోసం పూర్తి డెడికేషన్ తో వర్క్ చేస్తున్నాడు.
దర్శకుడు సైతం ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా కనక తేడా కొడితే అఖిల్ సినిమా కెరియర్ ముగిసిపోయినట్టే అని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ఏజెంట్ సినిమా మీద ప్రతి ఒక్కరికి భారీ అంచనాలైతే ఉండేవి. కానీ ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడమే కాకుండా అఖిల్ కెరియర్ ని చాలా వరకు డ్యామేజ్ చేసింది.
ముఖ్యంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కెరియర్ అయితే కోలుకోలేని పరిస్థితిలో ఉందనే చెప్పాలి. ఏజెంట్ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికి ఇప్పటివరకు ఆయన మరో సినిమా స్టార్ట్ చేయలేదు అంటే ఆ సినిమా సురేందర్ రెడ్డి కెరియర్ మీద ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు…